S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/16/2016 - 18:47

చెన్నై: తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో చెట్టును కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు సేలంలోని ఎంఐటీ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.

01/16/2016 - 16:08

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘అంకుర భారత్‌’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకం ముఖ్యాంశాలను అరుణ్ జైట్లీ వివరించారు. ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చాక దేశంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

01/16/2016 - 13:09

ముంబై : తాము విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపుతామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ జీఎస్టీపై షరతులకు కేంద్రం అంగీకరిస్తే కేవలం 15 నిమిషాల్లో రాజ్యసభలో బిల్లు గట్టెక్కుతుందన్నారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ఆ బిల్లుకు ఆమోదం దక్కడం లేదు.

01/15/2016 - 07:49

తిరువనంతపురం, జనవరి 14: జాతీయ స్థాయిలో జ్ఞాన్ పేరిట చేపట్టిన జాతీయ నెట్‌వర్క్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు కేంద్ర జనశక్తి వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన విద్యావేత్తలు భారత విద్యాసంస్థల్లో పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

01/15/2016 - 07:48

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అంతకుముందు కిడ్నాప్ చేసి, వదలిపెట్టిన పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) స్థాయి అధికారి సల్వీందర్ సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు వరుసగా నాలుగో రోజు గురువారం విచారించారు.

01/15/2016 - 07:48

న్యూఢిల్లీ, జనవరి 14: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం చేపట్టిన బేసి-సరి విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంత అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషనర్‌ను న్యాయస్థానం తీవ్రంగా మందలించింది.

01/15/2016 - 07:47

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి దారితీసిన కారణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లోపాలను కూపీ లాగేందుకు విస్తృత దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఓ దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.

01/15/2016 - 07:46

న్యూఢిల్లీ, జనవరి 14: అవినీతి నిర్మూలన కోసం ప్రతిపాదించిన లోక్‌పాల్ చైర్‌పర్సన్ పదవికి అనేక మంది ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికోసం 16 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, ఒక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఒక యూజీసీ సభ్యుడు, సమాచార కమిషనర్లు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

01/15/2016 - 07:46

న్యూఢిల్లీ, జనవరి 14: అరుణాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి సంబంధించి గౌహతి హైకోర్టు జారీ చేసిన కొన్ని ఉత్తర్వులపై దాఖలయిన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. గవర్నర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ సి నాగప్పన్‌లతో కూడిన బెంచ్ తెలిపింది.

01/15/2016 - 07:45

దుబాయ్, జనవరి 14: నలభై మంది జిహాదీలను ఉరితీసిన సౌదీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని ఆల్‌ఖైదా చీఫ్ అల్ జవహారీ పిలపునిచ్చాడు. పవిత్ర యుద్ధం చేస్తున్న వారిపై కత్తిగట్టిన వారిపై దాడులు చేయాలని కేడర్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఆన్‌లైన్లో జవహారీ ఓ ప్రకటన చేస్తూ సౌదీలో అధికార రాచరిక పాలనపై దుమ్మెత్తిపోశారు. సౌదీ అరేబియా ప్రభుత్వం జనవరి 2న 47 మందిని ఉరితీసింది.

Pages