S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/15/2016 - 07:31

అలహాబాద్, జనవరి 14: హిందువులకు ఎంతో పవిత్రమైన మకరసంక్రాంతి సందర్భంగా గురువారం అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో వేలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నెల రోజుల పాటు జరిగే మాఘమేళా మకరసంక్రాంతినుంచే ప్రారంభమవుతుంది. గట్టి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భక్తులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా మైళ్ల దూరం నడిచి తెల్లవారుజామునుంచే త్రివేణి సంగమానికి చేరుకున్నారు.

01/15/2016 - 07:31

న్యూఢిల్లీ, జనవరి 14: రాజకుటుంబాలు, వాటికి చెందిన నేతల పట్ల ప్రత్యేక విధేయతలకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిన్న స్థాయిలో ఉన్నా నిరుపమాన పట్టుదల, అంకిత భావంతో ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న వారిపై దృష్టి పెట్టాలన్నారు.

01/15/2016 - 07:30

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన జైషే మహ్మద్ అధినేత వౌలానా మసూద్ ఆజర్‌తోపాటు పలువురు ఇతర ఉగ్రవాదులను అరెస్టు చేశామని భారత ప్రభుత్వానికి వర్తమానం పంపించిన పాకిస్తాన్ పాలకుల అసలు రంగు బయటపడింది. జైషే మహ్మద్ నేతల అరెస్టు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీల్లాహ గురువారం ఇస్లామాబాద్‌లో ప్రకటించారు.

01/15/2016 - 07:28

న్యూఢిల్లీ, జనవరి 14: దేశంలో కాలేయ వ్యాధులు పెరిగిపోతుండడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేయడమే కాక, ఈ వ్యాథుల పట్ల ప్రజల్లో అవగాహన లేక పోవడం, అలాగే ఈ వ్యాధులను నయం చేసేందుకు తగిన చికిత్సలు లేక పోవడం కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు.

01/15/2016 - 06:52

న్యూఢిల్లీ,జనవరి 14: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కరువు సహాయం కింద 791 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నుండి ఈ మేరకు సాయం అందించాలని నిర్ణయించారు.

01/15/2016 - 06:30

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన జైషే మహమ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్ అరెస్టును పాకిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించకపోవటంతో శుక్రవారం జరగవలసిన రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం రద్దు అయ్యింది. విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశాన్ని పరస్పర అంగీకారంతో వాయిదా వేసుకున్నట్లు రెండు దేశాల అధికార ప్రతినిధులు గురువారం ప్రకటించారు.

01/14/2016 - 18:44

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఎయిర్ లైన్స్(పీఐఏ) కార్యాలయంపై గురువారం దాడి జరిగింది. బారాఖాంభా రోడ్డులో ఉన్న పీఐఏ కార్యాలయంలో హిందూ సేన కార్యాకర్తలు విధ్వంసానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

01/14/2016 - 12:52

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతిచెందారు. సిక్కిం- డార్జిలింగ్‌ సరిహద్దులోని 10వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా.. ప్రమాదవశాత్తు కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల నుంచి ఓ చిన్నారి సహా ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

01/14/2016 - 12:46

న్యూఢిల్లీ : : దేశ రాజధాని ఢిల్లీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి-బేసి వాహన నిబంధనను రద్దు చేయబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సరి-బేసి విధానాన్ని నిలిపివేయాలంటూ ఓ లాయర్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. లాయర్‌ అప్పీల్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి నగరవాసులు మద్దతివ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ కోరారు.

01/14/2016 - 11:48

దిల్లీ: దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

Pages