S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/12/2016 - 16:33

చెన్నై : తమిళనాడులో ఏర్పాటుచేసిన ఈ-సేవా కేంద్రాలను సీఎం జయలలిత మంగళవారంనాడు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆమె ఈ కేంద్రాలను ప్రారంభించారు. కరెంటు బిల్లులు, పన్నులు కట్టడం, జనన,మరణ ధృవీకరణ పత్రాలను పొందవచ్చని ఆమె తన ప్రకటనలో వెల్లడించారు.

01/12/2016 - 14:11

ఢిల్లీ : దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 12న జరుగనున్నది. 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ నెల 20 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

01/12/2016 - 14:10

ఢిల్లీ : పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానికి స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ను రెండో రోజూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారించింది. సల్వీందర్ సింగ్ పొంతనలేని సమాధానాలు చెప్పటంతో ఆయనకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే సల్వీందర్ వంట మనిషి మదన్ గోపాల్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.

01/12/2016 - 14:10

పంజాబ్ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్‌లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందటంతో అదనపు భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే పఠాన్‌కోట వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే.

01/12/2016 - 14:09

ఢిల్లీ : తమిళనాడులో పొంగల్‌కు పెద్దఎత్తున నిర్వహించే జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జల్లికట్టు నిర్వహణకు కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయం విదితమే. ఈ సంప్రదాయ విధానం జంతువులను హింసించటమేనని జంతు సంరక్షణ బోర్డు, పెటా, బెంగుళూరుకు చెందిన స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

01/12/2016 - 14:08

ఢిల్లీ : ఢిల్లీలోని మండోలి ప్రాంతంలోని గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 20 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.

01/12/2016 - 14:03

పంజాబ్ : గురుదాస్‌పూర్‌లో స్కూల్ బస్సు లోయలోపడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా, 12మందికి గాయాలయ్యాయి. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించింది.

01/12/2016 - 13:58

చెన్నై : తమిళనాడు తీరానికి దాదాపు వంద తిమింగిళాలు కొట్టుకు వచ్చాయి. మనపాడు, కళ్లమొజి గ్రామాల్లోని తుతుకోరిన్ తీరానికి తిమింగళాలు కొట్టుకు వచ్చాయి. వీటిని గమనించిన మత్స్యకారులు, అధికారులు వాటిని సముద్రంలోకి నెట్టినప్పటికీ మళ్లీ కొట్టుకువచ్చాయి. చిన్న మెప్పలతో ఈ తిమింగాళాలు ఉన్నాయని, ఇంత పెద్ద సంఖ్యలో తిమింగళాలు ఒడ్డుకు కొట్టుకురావటం ఇదే మొదటిసారని అధికారులు అన్నారు.

01/12/2016 - 12:06

దిల్లీ: పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానాతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు చలితో వణుకుతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభిస్తోంది. మరో వారం రోజులపాటు చలిగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

01/12/2016 - 05:56

న్యూఢిల్లీ, జనవరి 11: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడి విషయంలో పంజాబ్ పోలీసు సూపరింటెండెంట్ సల్వీందర్ సింగ్‌ను ఎన్‌ఐఎ అధికారులు సోమవారం దాదాపు 8గంటల పాటు ప్రశ్నించారు. ఇంటరాగేషన్‌లో ఆయన పొంతనలేని ప్రకటనలు చేసినట్టుగా స్పష్టమవుతోంది. సైనిక దాడిలో మృతిచెందిన నలుగురు ఉగ్రవాదుల వివరాలను పూర్తిస్థాయిలో నిర్థారించుకునేందుకు ఎన్‌ఐఎ ప్రయత్నిస్తోంది.

Pages