S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/12/2016 - 05:55

న్యూఢిల్లీ, జనవరి 11: రుతుస్రావ వయసులో ఉన్న మహిళలను కేరళలోని చరిత్రాత్మక శబరిమల ఆలయంలోకి ప్రవేశించనీయకుండా నిషేధం విధించి ప్రాచీన కాలం నుంచి కొనసాగిస్తున్న సాంప్రదాయన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం ఇలా చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ‘మతం ప్రాతిపదికపై మినహా మహిళల ప్రవేశంపై ఆలయం నిషేధం విధించడానికి వీల్లేదు.

01/11/2016 - 16:25

ఢిల్లీ: ముంబయి లోక్‌మాన్యతిలక్ టర్మినల్- కాజీపేట మధ్య ప్రయాణించే ఆనంద్‌వన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ముంబై- కాజీపేట రైలు సర్వీసును కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రారంభించారు. ఈ కొత్త రైలు వారానికి ఓసారి ముంబయి-కాజీపేట మార్గంలో నడుస్తుంది.

01/11/2016 - 16:25

ఇస్లామాబాద్ : పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు లింకు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

01/11/2016 - 14:15

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన 35మంది నావికులకు ట్యూటికోరిన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. 2013లో అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణల కిందట విచారించిన కోర్టు వారికి ఐదేళ్లపాటు కఠిన కారాగార శిక్షను విధించింది.

01/11/2016 - 13:47

న్యూఢిల్లీ: భాజపా ఎంపీలు ఎస్‌.ఎస్‌. అహ్లూవాలియా, భూపేంద్రయాదవ్‌, బి.డి.రామ్‌లను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సస్పెండ్‌ చేశారు. సామూహిక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించారన్న కారణంగా వీరిపై వేటు పడింది.

01/11/2016 - 13:15

న్యూఢిల్లీ: పంజాబ్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఎదుట హాజరయ్యారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం గురించి అతను చెబుతున్న సమాచారంలో పొంతన లేకపోవడంతో ఎన్ఐఏ అధికారులు సల్వీందర్‌ను ఢిల్లీ తీసుకువెళ్లి విచారించాలని నిర్ణయించుకున్నారు. అతనికి సత్యశోధన పరీక్షలు కూడా చేయించే అవకాశం ఉంది.

01/11/2016 - 13:10

న్యూఢిల్లీ: విపత్కర పరిస్థితుల్లో సైనికులు గొప్ప సేవలందిస్తున్నారని, సైనికుల త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తిస్తామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. 66వ సైనిక దినోత్సవంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించే శత్రువులను తుదముట్టించాల్సిన అవసరముందన్నారు.

01/11/2016 - 13:10

న్యూఢిల్లీ: సంకాంత్రి పండుగ సందర్భంగా తమిళనాడు నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 2014లో సుప్రీం తీర్పునకు కేంద్రం నోటిఫికేషన్‌ విరుద్ధంగా ఉందని జంతు సంరక్షణ సమితి, పెటా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జల్లికట్టు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు.

01/11/2016 - 11:54

చెన్నై: వరద బాధితులకు నేరుగా రూ.700 కోట్ల నష్టపరిహారాన్ని అందజేసి తమిళనాడు ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఆర్థిక సాయం అందించే సమయంలో దళారుల ప్రమేయాన్ని, అవకతవకలను అరికట్టేందుకు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో 14 లక్షల వరద బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమ చేశారు.

01/11/2016 - 07:33

ముంబయి, జనవరి 10: ప్రపంచానికి భారత్ ఆధ్యాత్మికతను అందజేసిందని, అంతేతప్ప మతోన్మాదాన్ని కాదని, మత గురువులు, సాధువులు ఎల్లప్పుడూ మానవాళి సంక్షేమం కోసమే కృషి చేస్తుంటారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రముఖ జైనమత గురువు ఆచార్య రత్నసుందర్‌సురిజీ మహరాజ్ రచించిన 300వ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరిస్తూ ఈ విషయాలను స్పష్టం చేశారు.

Pages