S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/08/2016 - 07:40

న్యూఢిల్లీ, జనవరి 7: పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరును కాంగ్రెస్ పార్టీ గురువారం తీవ్రంగా దుయ్యబడుతూ, భారత్‌ను ఇబ్బందికి గురిచేయడం మానుకోవాలని ఆయనకు సలహా ఇచ్చింది. అంతేకాదు, పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో చర్చలకు సంబంధించి వేచి చూసే విధానాన్ని అనుసరించాలని ఆయనకు సూచించింది.

01/08/2016 - 07:40

ముంబయి, జనవరి 7: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’లో ఇక అమీర్ ఖాన్ కనిపించడు. ఆయన స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను చేర్చవచ్చని తెలుస్తోంది.

01/08/2016 - 07:38

న్యూఢిల్లీ, జనవరి 7: కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ కన్నుమూశారు. ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)లో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న 79ఏళ్ల సరుూద్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

01/08/2016 - 07:23

న్యూఢిల్లీ, జనవరి 7: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచటం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు భద్రాచలం డివిజన్ గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయటం, రాజ్యసభ సభ్యులను మార్చటం గురించి న్యాయశాఖతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు.

01/08/2016 - 07:02

న్యూఢిల్లీ, జనవరి 7: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచటం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు భద్రాచలం డివిజన్ గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయటం, రాజ్యసభ సభ్యులను మార్చటం గురించి న్యాయశాఖతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు.

01/08/2016 - 06:28

హైదరాబాద్, జనవరి 7: కృష్ణా జలాలను పునఃకేటాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

01/08/2016 - 05:12

న్యూఢిల్లీ, జనవరి 7: జిఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సహకరించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఎన్డీయే ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సోనియా అంగీకరిస్తే రెండు బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందుకు జరుపుతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపాదించారు. వెంకయ్యనాయుడు గురువారం ఉదయం 10 జనపథ్ వెళ్లి సోనియాతో చర్చలు జరిపారు.

01/07/2016 - 17:35

చెన్నై :సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళనాడు రాష్టవ్య్రాప్తంగా 12,624 బస్సులను నడపనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గురువారనాడు ప్రకటించారు. మెరీనా బీచ్‌కు 600 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు బస్సులలో అధిక చార్జీలు వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

01/07/2016 - 17:35

లిబియా:లిబియా పోలీసు శిక్షణా శిబిరంపై బాంబుదాడి జరిగింది . ఈ ఘటనలో 40 మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది ఐసిస్ ఉగ్రవాదులేనని భావిస్తున్నారు. బాంబుదాడి నేపథ్యంలో లిబియా ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది.

01/07/2016 - 17:34

చెన్నై : ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్నాడీఎంకే మహిళా విభాగం కార్యదర్శి శశికళ పుష్పను తొలగించారు. ఆమె స్థానంలో రాష్ట్ర జౌళి శాఖ మంత్రి ఇందిర పుష్పను నియమించామని, ఆమెకు అందరు సహకరించాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆదేశించారు. అలాగే పార్టీ ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Pages