S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/07/2016 - 04:33

న్యూఢిల్లీ, జనవరి 6: ఆంధ్రప్రదేశ్‌లోని కరువు నెలకొన్న ప్రాంతాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాలుకు కేంద్ర ప్రభుత్వం రూ.433.77 కోట్లు కేటాయించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

01/07/2016 - 04:33

న్యూఢిల్లీ, జనవరి 6: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటుగా మావోయిస్టులతో పోరాడడం కోసం అవసరమైన సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఏడు రాష్ట్రాల్లోని 35 నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదించింది.

01/06/2016 - 17:44

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని తాంగ్‌ధర్‌ సెక్టార్‌ వద్ద ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. బుధవారం తెల్లవారుజామున కొంతమంది ఉగ్రవాదులు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడినట్లు సమాచారం అందింది. జమ్మూ నుంచి పఠాన్‌కోట్‌కు ఉన్న 109 కిలోమీటర్ల హైవేను పూర్తిగా బ్లాక్‌ చేసి తనిఖీలు నిర్వహించారు.

01/06/2016 - 17:35

అగర్తల: త్రిపురలోని బెలోనియా వద్ద బస్సు కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై విచారణకు ఆదేశించారు.

01/06/2016 - 15:21

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నుంచి దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు పటిష్ట భద్రతకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

01/06/2016 - 15:08

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టుగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబానికి రూ. 100 నగదు, కిలో బియ్యం, కిలో చక్కెరతో పాటు.. రెండు అడుగుల పొడవైన చెరకు గడలను పొంగల్ గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.

01/06/2016 - 15:00

చెన్నై‌: తమిళనాడులోని ప్రముఖ మధుర మీనాక్షి దేవాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి కొందరు వ్యక్తులు మూడు పెట్రోలు బాంబులను విసిరారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని వారు పేర్కొన్నారు.

01/06/2016 - 13:18

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని పటాన్‌కోట వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిపై ఏన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణను ప్రారంభించింది. దర్యాప్తు బృందం బుధవారం ఉదయం పటాన్‌కోట చేరుకుంది. ఉగ్రవాదుల మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో అధికారులు పరిశీలించారు.

01/06/2016 - 11:41

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి ఘటనపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. దేశ అంతర్గత భద్రత, తాజా రాజకీయ పరిణామాలపై కూడా మంత్రుల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకొంటున్నారు.

01/06/2016 - 11:40

ముంబై: న్యాయస్థానం శిక్షా కాలాన్ని తగ్గించడంతో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ వచ్చే నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న అభియోగంపై కోర్టు ఆయనకు ఆరేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Pages