S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/06/2016 - 11:39

భోపాల్: భోపాల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లాండింగ్ అవుతుండగా ఆ విమానం టైరు పగలడంతో ఒక్కసారి కుదుపునకు లోనైంది. ఇందులో సుమారు 100 మంది ప్రయాణీకులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.

01/06/2016 - 07:57

న్యూఢిల్లీ,జనవరి 5: తెలంగాణ రాష్ట్రానికి సివిల్ సర్వీస్ ఉద్యోగుల కేటాయింపు, పెంపు అంశాలపై డిఓపిటి అధికారులతో చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. ఇరువురు సీనియర్ అధికారులు మంగళవారం డిఓపిటి అధికారులతో చర్చలు జరిపిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

01/06/2016 - 07:29

న్యూఢిల్లీ, జనవరి 5: ఇఎస్‌ఐసి కార్మికులందరికి సామాజిక న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దత్తాత్రేయ మంగళవారం ఇఎస్‌ఐసి 2016 సంవత్సరం క్యాలెండర్‌ను విడుదలు చేసిన అనంతరం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఇఎస్‌ఐసి పథకాన్ని కార్మికులందరికీ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

01/06/2016 - 07:21

పఠాన్‌కోట్, జనవరి 5: భద్రతకు సంబంధించిన ‘కొన్ని లోపాలే’ పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి దారితీశాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మంగళవారం అంగీకరించారు. పాకిస్తాన్‌లో తయారైన ఆయుధాలను ఉపయోగించి ఈ దాడికి తెగబడిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదులూ హతమయ్యారని ఆయన చెప్పారు.

01/06/2016 - 07:19

న్యూఢిల్లీ, జనవరి 5: డిడిసిఏ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో ఐదుగురు తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు చేశారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం కోర్టులో స్పష్టం చేశారు. తాను డిడిసిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎవరి నుంచి ఏ రకమైన ఆర్థిక లబ్ధిని పొందలేదని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తును తప్పుదోవపట్టించే ఉద్దేశంతోనే కేజ్రీవాల్ తదితరులు ఈ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపారు.

01/06/2016 - 07:18

ఇంఫాల్/న్యూఢిల్లీ, జనవరి 5: మణిపూర్ సహా పలు ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసిన పెను భూకంపం వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడంతోపాటు తక్షణమే సహాయ చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలు సన్నద్ధమయ్యాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతో సంభవించిన భూ కంపంలో 8 మంది మృతి చెందారు. అనేక రహదారులు, భవనాలు బీటలువారాయి. జాతీయ విపత్తుల నిరోధక దళానికి (ఎన్‌డిఆర్‌ఏ) చెందిన సహాయక బృందాలు మణిపూర్‌కు తరలివచ్చాయి.

01/06/2016 - 07:17

న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగింది ఉగ్రవాదుల దాడి కాదనీ, అది భారత్‌పై జరిగిన దాడి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రదాడి మామూలు సంఘటన కాదన్నారు.

01/06/2016 - 07:17

న్యూఢిల్లీ, జనవరి 5: ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో తెలుగు విద్యార్థుల సమస్యల గురించి అమెరికా ప్రభుత్వంతో ఉన్నతస్థాయి చర్చలు జరపాలని సూచించారు.

01/06/2016 - 07:16

న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి అనేక అంశాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మిలిటెంట్ల మధ్య ఏ రకమైన సంభాషణ జరిగిందన్న దానిపై గురుదాస్‌పూర్ ఎస్‌పికి చెందిన స్నేహితుడు రాజేశ్ వర్మ కీలక వివరాలు వెల్లడించారు.

01/06/2016 - 07:15

బీజింగ్, డిసెంబర్ 5: చైనా వాయువ్య ప్రాంతంలో మంగళవారం ఒక ఉన్మాది బస్సును దగ్ధం చేయడంతో 17 మంది మృతిచెందగా, మరో 32 మంది గాయపడ్డారు. హెలన్ రాష్ట్రంలోని ఇంచువాన్ నగరంలో ఫర్నీచర్ మాల్ సమీపాన సోమవారం ఉదయం దాదాపు 7 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ బస్సుకు నిప్పంటించినట్టుగా అనుమానిస్తున్న మయోంగ్‌పింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Pages