S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/06/2016 - 05:53

న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఫలితాలు చూపించాలని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను డిమాండ్ చేశారు. షరీప్ మంగళవారం సాయంత్రం మూడు గంటల ముప్ఫై నిమిషాలకు శ్రీలంకనుండి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఎయిర్ బేస్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించారు.

01/05/2016 - 18:33

హర్యానా ‌: హర్యానాలోని అంబాలాలో అమరజవాను గురుసేవక్‌ సింగ్‌ కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మంగళవారం పరామర్శించారు. గర్నాలా గ్రామానికి చెందిన సింగ్‌ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

01/05/2016 - 17:00

న్యూఢిల్లీ : : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మంగళవారం ఫోన్‌ చేశారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిపై విచారణలో తమ దేశం పూర్తి సహకారం అందిస్తుందని షరీఫ్‌ భారత ప్రధానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

01/05/2016 - 16:40

పంజాబ్: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోందని, ఎప్పుడు ముగుస్తుందో తెలియదని, ఆపరేషన్ ముగింపు విషయంలో ఎన్‌ఎస్‌జీదే తుది నిర్ణయమని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఇవాళ ఆయన పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. కాల్పులు జరిపిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

01/05/2016 - 16:23

ముంబయి : క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందలు తెలిపారు. ప్రణవ్.. ఓ ఇన్నింగ్స్ లో అజేయంగా 1009 పరుగుల ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. నీ కృషే నీకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది.

01/05/2016 - 16:11

పంజాబ్: పఠాన్ కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది. దీంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగివున్నారనే దానిపై మరింత ఆందోళన నెలకొంది.

01/05/2016 - 15:45

చెన్నై : శ్రీలంక నేవీ అధికారులు 12 మంది తమిళనాడుకు చెందిన జాలర్లను అరెస్టు చేశారు. కచ్చతీవు సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లను వారు అరెస్టు చేశారని మత్స్య శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గోపీనాథ్‌ తెలిపారు.మత్స్యకారులతోపాటు మూడు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

01/05/2016 - 12:59

న్యూఢిల్లీ : హస్తినలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ సర్కార్ చేపట్టిన సరి - బేసి విధానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పాటిస్తున్నారు. టీఎస్ ఠాకూర్ జస్టిస్ శిక్రి కారులో కోర్టుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఠాకూర్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.

01/05/2016 - 12:57

న్యూఢిల్లీ :‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌హెచ్‌ కపాడియా అనారోగ్యంతో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కపాడియాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ముంబయిలో జరగనున్నాయి.

01/05/2016 - 11:44

చండీగఢ్: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో చొరబడిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మంగళవారం నాలుగో రోజు కూడా సైనికులు వేట కొనసాగిస్తున్నారు. ఇంతవరకు ఆరుగురు ఉగ్రవాదులు హతమయినట్లు, మరి కొందరు ఇంకా అటవీ ప్రాంతంలో పొంచి ఉన్నట్లు సైనిక బలగాలు అనుమానిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌ఎస్‌జి కమాండోలు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ల పై నుంచి కూడా ఉగ్రవాదుల కోసం ఆరా తీస్తున్నారు.

Pages