S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/04/2016 - 16:51

ఢిల్లీ : సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్ అంత్యక్రియలు సోమవారంనాడు ఢిల్లీలో ముగిశాయి. బర్దన్ అంత్యక్రియలకు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

01/04/2016 - 16:40

పంజాబ్ :పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పాకిస్థాన్‌కు చెందిన మూడు సిమ్ కార్డులను,ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

01/04/2016 - 16:39

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లడాఖ్‌లో మంచు చరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లను లడాఖ్ స్కౌట్స్‌కు చెందినట్లుగా గుర్తించారు. భారత్, మణిపూర్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడం వల్ల మంచు చరియలు విరిగి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

01/04/2016 - 13:59

పంజాబ్‌ : పఠాన్‌కోట్‌ ఆపరేషన్‌, కూంబింగ్‌ కొనసాగుతోందని ఎన్‌ఎస్‌జీ ప్రకటించింది. ఎయిర్‌బేస్‌కు మరిన్ని బలగాలను మోహరించామని తెలిపింది. నేషనల్ సెక్యూర్టీ గార్డ్స్ ఆధ్వర్యంలో ఉగ్ర వేట జరుగుతోంది.

01/04/2016 - 13:40

న్యూఢిల్లీ : ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

01/04/2016 - 13:14

ముంబయి ‌: ముంబయి నుంచిఇస్తాంబుల్‌ వెళ్తున్న టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో సోమవారం ఓ సెల్‌ఫోన్‌ కలకలం సృష్టించింది.. ఓ ప్రయాణికుడి సీటు కింద విమాన సిబ్బంది సెల్‌ఫోన్‌ను గుర్తించారు. సిబ్బంది ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించడంతో వారు విమానాన్ని తిరిగి ముంబయికి రప్పించారు. ప్రయాణికులందరినీ బయటకు పంపించివేసి.. భద్రతా సిబ్బంది విమానాన్ని తనిఖీ చేశారు.

01/04/2016 - 12:58

బెంగళూరు: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ మృతదేహాన్ని సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. బాంబు నిర్వీర్యం చేయడంతో నిపుణుడైన నిరంజన్‌‌కుమార్ ఆదివారం పఠాన్‌కోట్‌లో ఒక గ్రెనేడ్‌ను డిఫ్యూస్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.నిరంజన్ మృతదేహాన్ని కడసారి చూసేందుకు బెంగళూర్ వాసులు బారులు తీరారు.

01/04/2016 - 12:03

గౌహతి : ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాలతోపాటు బంగ్లాదేశ్‌లోనూ సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. మణిపూర్‌లో ఉదయం 9 గంటల తర్వాత మరోసారి కూడా భూమి కంపించింది. తెల్లవారు జామున వచ్చిన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

01/04/2016 - 08:35

మైసూరు, జనవరి 3: భారత్‌లో విజ్ఞాన శాస్త్రాల పరిశోధనలు చేయడాన్ని సులభతరం చేస్తామని, సైన్స్ పరిపాలనను మెరుగుపరుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో విజ్ఞాన శాస్త్రాల బోధన, పరిశోధనను విస్తృతం చేయడంతో పాటు వాటి నాణ్యతను మెరుగుపరుస్తామని ఆయన శాస్తవ్రేత్తలకు వివరించారు.

01/04/2016 - 08:33

బెంగళూరు, జనవరి 3: ఆరోగ్య రంగంలో యోగాను, భారతీయ సంప్రదాయ వైద్యాన్ని సమ్మిళితం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ఈ రెండింటిని మరింత సన్నిహితం చేసి భారతీయుల, మిగతా ప్రపంచ ప్రజలందరి జీవన శైలిలో భాగం చేయాలని ఆయన ఉద్బోధించారు.

Pages