S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/17/2015 - 17:10

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై ఆప్, కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలను బీజెపీ ఖండించింది. జైట్లీకి మద్దతు పలికింది. జైట్లీ అవినీతి ఆరోపణలపై రుజువులుంటే ఇన్నాళ్లు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించింది.

12/17/2015 - 17:09

న్యూఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు గురువారంనాడు కూడా ఆందోళన కొనసాగించారు. అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ సర్దిచెప్పటానికి ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినకపోవటంతో సభను వాయిదా వేశారు.

12/17/2015 - 17:08

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా వైద్య కళాశాలకు చెందిన ఆసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత పది గంటల్లో ఆసుపత్రిలో జన్మించిన ఏడుగురు శిశువులు మృత్యువాతపడ్డారు.

12/17/2015 - 17:04

హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణిల ఆరోగ్య పరిస్థితిని ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యుల బృందం పరిశీలించింది. ఇవాళ నీలోఫర్ ఆసత్రికి చేరుకున్న ఎయిమ్స్ వైద్యులు వీణా-వాణిలను పరిశీలించారు. ఢిల్లీలో మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఆ పరీక్షల నిర్వహణ తర్వాతే శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. వీరి శస్త్ర చికిత్సపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.

12/17/2015 - 16:59

న్యూఢిల్లీ : దేశ అభివృద్ధికి అవసరమైన బిల్లులు పాస్‌కాకుండా కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగానే సభను అడ్డుకుంటుందని కేంద్ర పార్లమెంటరీ వ్వవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసుపై ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నస్తుందని అన్నారు. సభా కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

12/17/2015 - 14:22

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే తరహాలోనే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.తెలంగాణలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయన్నారు.

12/17/2015 - 14:19

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు గ్రెనైడ్లతో దాడులు చేశారు. శ్రీనగర్‌లోని సేకి దఫర్ ప్రాంతంలో జరిగిన దాడిలో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ పేలుడు వల్ల ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రెనైడ్లతో ఎవరు దాడి చేశారన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.

12/17/2015 - 14:15

న్యూఢిల్లీ: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. యువత కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. గూగుల్‌లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు మిఠాయి దుకాణంలో చిన్నపిల్లాడు అడుగుపెట్టినట్లు అనిపించిందని తన అనుభవాన్ని తెలిపారు.

12/17/2015 - 07:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పథకం ప్రకారమే ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.

12/17/2015 - 07:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో మహిళలు ఇప్పటికీ జీవితంలోని అన్ని రంగాల్లో హింసను ఎదుర్కొంటూనే ఉన్నారని, తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే భావన ఒక్కటే పరిస్థితిలో మార్పు తీసుకువస్తుందే తప్ప శిక్షల తీవ్రత కాదని మహిళా హక్కులకోసం పోరాటం చేస్తున్న పలువురు ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన జరిగి బుధవారానికి మూడేళ్లు పూర్తయంది.

Pages