S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/17/2015 - 07:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆమె తల్లి తన కుమార్తె పేరును తొలిసారిగా వెల్లడించడమే కాకుండా ఆమె పేరు చెప్పడానికి తానేమీ సిగ్గుపడడం లేదని కూడా స్పష్టం చేసింది.

12/17/2015 - 07:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: బంగారు తెలంగాణ మాటెలా ఉన్నా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫిరాయింపుల రాష్ట్రంగా మారుస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తాను, తన పార్టీ, తన కుటుంబం తప్పించి ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కెసిఆర్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

12/17/2015 - 07:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో కరవుపీడిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రం, ఎనిమిది రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేతో కూడిన ధర్మాసనం సుప్రీంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించింది.

12/17/2015 - 07:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అల్‌ఖైదాతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఢిల్లీ పోలీసులు బుధవారం తొలిసారిగా దేశంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ అనే 41 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. అయితే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి.

12/17/2015 - 07:21

న్యూఢిల్లీ/లక్నో, డిసెంబర్ 16: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన ఆదేశాలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు రాజ్యాంగపరంగా తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర సింగ్‌ను రాష్ట్ర లోకాయుక్తగా బుధవారం నియమించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

12/17/2015 - 06:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: తెలంగాణ లో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల నుండి వి ధానమండలికి జరుగుతున్న ఎన్నిక ల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యు డు గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశా రు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి డాక్టర్ నసీం, జయిదీకి సుఖేందర్‌రెడ్డి బుధవారం ఈ మేరకు లేఖ రాశారు.

12/17/2015 - 06:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని టిడిపి ఎంపీ ఎం శ్రీనివాసరావులోక్‌సభలోప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చేసిన హామీ మేరకు ఒక కొత్త రైల్వే డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోఏర్పాటు చేయవలసి ఉందని ఆయన గుర్తుచేశారు.

12/17/2015 - 06:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించాలని తెలుగుదేశం ఎంపీలు ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం జనవరి మొదటి వారంలో నరేంద్ర మోదీని కలవాలని తెలుగుదేశం ఎంపీలు భావిస్తున్నారు.

12/17/2015 - 06:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు సేకరించిన ప్రాంతంలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవటం వల్ల భూమిని ఇచ్చిన కొంతమంది అక్కడే తాత్కాలికంగా ఉంటున్నారని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జులో వోరమ్ చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో ఆయన ఈ సంగతి చెప్పారు.

12/17/2015 - 05:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోకపోవచ్చంటూఓ వైపు పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరూ శనివారం ఢిల్లీ కోర్టు ఎదుట హాజరవనున్నాన్నారు.

Pages