S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/16/2015 - 11:48

దిల్లీ: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ఇద్దరు ఉగ్రవాదులను దిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరు జిహాదీ సంస్థకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలో దిల్లీ, యు.పి. తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

12/16/2015 - 07:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ సచివాలయంపై మంగళవారం సిబిఐ సోదాలు చేయడం పట్ల అటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సోదాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తముందని కేజ్రివాల్ ఆరోపిస్తూ ఆయన ఒక పిరికిపంద, సైకో అని మండిపడ్డారు.

12/16/2015 - 07:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు తాము ఎన్నికల్లో చేసిన వ్యయానికి సంబంధించిన లెక్కలు చూపడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్టవేసి, స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం క్లిష్టంగా మారిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీమ్ జైదీ అన్నారు. ఎన్నికల్లో ధనమే ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

12/16/2015 - 07:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: లోక్‌సభలో నెలకొంటున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమేనని స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు ఏదో ఒక అంశాన్ని లేవదీసి ప్రధాన మంత్రి, ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పార్లమెంటును స్తంభింపజేయడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

12/16/2015 - 07:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం కూడా లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో గొడవచేసిన అనంతరం జీరో అవర్‌లో కొద్దిసేపు నినాదాలిచ్చి సభనుండి వాకౌట్ చేశారు. అనంతరం లోక్‌సభ సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగింది.

12/16/2015 - 07:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: మన్మోహన్ సింగ్ స్థానే ప్రణబ్ ముఖర్జీని 2004లో ప్రధాన మంత్రిని చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత దుస్థితి తప్పి ఉండేదని గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫలితాలు భిన్నంగా ఉండేవని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తన తాజా పుస్తకంలో పేర్కొన్నారు.

12/16/2015 - 07:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం మరోసారి అసభ్యకరమైన పదజాలంతో ప్రధాని మోదీని విమర్శించి సరికొత్త వివాదానికి తెరతీశారు. తన కార్యాలయం, ముఖ్య కార్యదర్శి నివాస గృహంపై సిబిఐ సోదాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని పిరికిపంద అని, సైకో అని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి ఘాటుగా స్పందించింది.

12/16/2015 - 07:50

ఇటార్సి, డిసెంబర్ 15: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో మంగళవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు వంతెనపైనుంచి నదిలో పడిపోవడంతో ఏడుగురు మహిళలు సహా 15 మంది చనిపోగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఇండోర్ నుంచి పరాసియా వెళ్తుండగా మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు సోహగ్‌పూర్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి సిద్ధార్థ్ సింగ్ చెప్పారు.

12/16/2015 - 07:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలిగించటానికి కావలసిన చర్యలు తీసుకోవలసిందిగా నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు ఒక వినతి పత్రం అందచేశారు. వర్గీకరణ జరిగి నాలుగేళ్లు అమలు జరిగిందని ఆయన తెలిపారు. 2004లో సుప్రీమ్ కోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించినందున ఆగిపోయిందిన ఆయన చెప్పారు.

12/16/2015 - 07:08

న్యూఢిల్లీ,డిసెంబర్ 15:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్డూ సర్క్యులర్ రైల్వే సదుపాయాన్ని కల్పించవలసిందిగా గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. అమరావతిని చేరుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి రైలు సదుపాయాలను మెరుగుపరచవలసిన అవసరంపై ఆయన వివరించారు.

Pages