S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/15/2015 - 16:29

ఢిల్లీ : దేశరాజధాని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘం, తెలంగాణ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వేర్వేరుగా ధర్మాలు నిర్వహించారు. చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆర్. కృష్ణయ్య నాయకత్వం వహించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించింది.

12/15/2015 - 14:15

ముంబయి : ముంబయిలో ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్‌, ఆమె న్యాయవాది హరీశ్‌ భంభానీల హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టైన వారిలో టెంపో డ్రైవర్‌ వికాస్‌, మరో ఇద్దరు మూడేళ్లుగా హేమా ఉపాధ్యాయ్‌కి చెందిన గిడ్డంగిలో పని చేసేవారే కావడం గమనార్హం.

12/15/2015 - 13:33

చెన్నై : వరద బాధితుల సహాయార్థం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ వెల్లడించారు. వరద బాధితులదరినీ ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అన్నారు.

12/15/2015 - 13:15

ఢిల్లీ : ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ప్రతి వివాదంలో ప్రధానిని లాగడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందన్నారు. సీబీఐ... ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదని స్పష్టం చేశారు.

12/15/2015 - 11:38

దిల్లీ: దిల్లీ సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయాలపై సిబిఐ జరిపిన దాడుల్లో తమ ప్రమేయం లేదని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సిబిఐ పై తాము ఆధిపత్యం చెలాయించాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఏం జరిగినా ప్రధాని మోదీని విమర్శించడం సరికాదని అన్నారు.

12/15/2015 - 11:36

పాట్నా: బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల మంగళవారం ఉదయం సుమారు 10 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బీహార్‌లోని గయ, జుమాయి, జార్ఖండ్‌లోని ధన్‌బాద్, తదితర ప్రాంతాల్లో భూమి కంపించటంతో జనం ఇళ్ళల్లోంచి బయటకు పరుగులు తీశారు.

12/15/2015 - 11:35

దిల్లీ: దిల్లీ సచివాలయంలో మంగళవారం ఉదయం సిబిఐ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన ముఖ్య కార్యదర్శి ఛాంబర్‌లో కూడా సోదాలు జరిగాయి. రాజకీయ కక్షతోనే ప్రధాని మోదీ సిబిఐ దాడులు జరిగేలా ఆదేశించారని దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్ ఆరోపించారు.

12/15/2015 - 11:35

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

12/15/2015 - 04:30

త్రిచూర్, డిసెంబర్ 14: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో బిజెపి అధికారంలోకి రాగలదన్న ధీమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్, సిపిఎం సారథ్యాల్లోని రెండు ఫ్రంట్‌ల ఆధిపత్యాన్ని బిజెపి అధిగమిస్తుందని, ప్రస్తుతం చాలా బలమైన శక్తిగా మూడో స్థానంలో ఉందని మోదీ తెలిపారు. ఈ మూడో శక్తిని శివుని మూడో కన్నుతో పోల్చారు.

12/15/2015 - 03:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించటానికి తెరాస ప్రభుత్వం తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బిజెపి, టిడిపిలు ఆరోపించాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమినర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయ. సోమవారం రెండు పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల కమిషనర్‌తో సమావేశమై తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు.

Pages