S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/05/2015 - 15:30

చింతూరు: ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని కన్‌కేర్ జిల్లా భానుప్రతాప్‌పూర్ డివిజన్ పరిధిలోని తడోకి పెదబేడ అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించగా డంప్ ను గుర్తించారు. 4 టిఫిన్ బాక్స్ బాంబులు, 11 బార్మర్ తుపాకులు, 2 పిస్టల్స్, భారీ ఎత్తున డిటోనేటర్‌లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

12/05/2015 - 15:23

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలో హిందూ సమూహాంపై వరుస బాంబు దాడులు జరిగాయి. శనివారం ఉదయంస్థానిక హిందువులంతా ఒకచోట చేరి సంప్రదాయ రష్‌మెలా వేడుకలు నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

12/05/2015 - 15:22

జమ్ముకాశ్మీర్‌ : ఐఎస్ఐకి సంబంధాలున్న ఆరోపణలపై రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్‌, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర పోలీసు దళాలు రాజౌరీ జిల్లాలో సంయుక్త దాడులు నిర్వహించాయి. ఐఎస్‌ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరు ప్రభుత్వోద్యోగి కాగా.. మరొకరు కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికుడు మున్వార్‌ అహ్మద్‌ మిర్‌ కావడం గమనార్హం.

12/05/2015 - 14:00

చెన్నై : చెన్నైలో శనివారం ఉదయం మళ్లీ భారీ వర్షం పడుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోయంబేడ్, పళ్లవాక్కం, ఎగ్మోర్, అన్నామలై కాలనీ, జఫర్‌ఖాన్ పేట, సైదాపేట, తొట్టూరుపురం, మండవల్లి, అడియార్, ఆడంబాకం తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

12/05/2015 - 13:59

న్యూఢిల్లీ : వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ వెబ్‌సైట్లను నిషేధించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వీటిని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రజ్వల సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

12/05/2015 - 13:59

న్యూఢిల్లీ : దక్షిణ హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లు యూఎన్‌జీఎస్ అధికారులు వెల్లడించారు. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.

12/05/2015 - 13:58

లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే పోటీచేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ములాయం సింగ్ యాదవ్‌ను ప్రధానిగా చేస్తామంటే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించిన విషయం విదితమే.

12/05/2015 - 13:57

చెన్నై : చెన్నై వరద బాధితులకు సినీ నటి ఖుష్బు దుప్పట్లు, దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. చెంగల్‌పేట్, కాంచీపురం తదితర ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించి వారికి దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తన కుమార్తె కూడా పాల్గొన్నట్లు ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

12/05/2015 - 13:53

చెన్నై: వరద బాధితులకి సహాయ, పునరావాస కార్యక్రమాల్లో తమిళ సినీ నటుడు ధనుష్‌ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. కిల్‌పాక్‌ అనే ప్రాంతంలో నీరజ్‌ అనే ఓ అభిమాని 12 వేల వాటర్‌ పాకెట్స్‌ అందించేందుకు సిద్ధం చేసి ఉంచారు. వాటిని నటుడు ధనుష్‌కి అందజేశారు.

12/05/2015 - 13:51

చెన్నై: వరద ప్రాంతాల పరిస్థితిపై కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రైల్వే, సమాచార, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. చెన్నైలో చేపట్టిన సహాయక కార్యక్రమాలపై కేబినెట్‌ సెక్రటరీ అడిగితెలుసుకున్నారు.

Pages