S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/04/2015 - 05:17

తక్షణ సాయంగా వెయ్యకోట్లు
ప్రధాని మోదీ ప్రకటన
వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

12/04/2015 - 04:56

ఉదారంగా నిధులూ ఇవ్వండి కేంద్రానికి బాలకృష్ణ విజ్ఞప్తి

12/04/2015 - 04:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 3:శారద కుంభకోణం, బిసిసిఐ సంస్కరణలు సహా అనేక కీలక తీర్పులు వెలువరించిన సీనియర్ న్యాయమూర్తి 63 సంవత్సరాల టి.ఎస్.్ఠకూర్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. భారత దేశ 43వ చీఫ్ జస్టీస్‌గా ఠాకూర్ చేత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

12/03/2015 - 17:57

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని నదులు ఉప్పొంగుతున్నాయి. చెన్నై నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెంబారంబాకమ్ చెరువు ప్రమాదస్థాయికి చేరడంతో చెరువు నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కారణంగా నగర శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

12/03/2015 - 17:47

చెన్నై : తమిళనాడు వరద బాధితులకు సాయం అందించేందుకు విశాఖ నుంచి బయలుదేరిన ఐఎస్‌ఎస్ ఐరావత్ నౌక చెన్నై తీరానికి చేరుకుంది. ఆహారపదార్థాలు, నీళ్లను తోడే పంపుసెట్ల ఇంజన్లు, సైన్యం, డ్రైవర్లతో ఇది చేరుకుంది. వీరంతా వరద ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టనున్నారు.

12/03/2015 - 17:46

చెన్నై : తమిళనాడులో కురుస్తున్న కుండపోత వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలలో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేశారు. ప్రధాని మోదీని తమిళనాడు సీఎం జయలలిత ఐఎన్‌ఎస్ అడియార్‌లో కలుసుకున్నారు. అంతకు ముందు ఏరియల్ సర్వే చేసిన జయలలిత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నష్టం అంచనాల వివరాలను ప్రధాని మోదీకి అందజేశారు. మరింత సాయం చేయాలని ఆమె మోదీని కోరారు.

12/03/2015 - 15:58

న్యూఢిల్లీ: కృష్ణా నది జలాల వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతోన్న విచారణ వాయిదా పడింది. నదీ జలాలపై విచారణను వచ్చే మంగళ వారానికి వాయిదా వేస్తోన్నట్టు ధర్మాసనం తెలిపింది.

12/03/2015 - 15:47

విజయవాడ : అమరావతిలో వికలాంగుల కోసం స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పి.బి.సిద్దార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... రెండేళ్లలో 623 మంది వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

12/03/2015 - 15:46

న్యూఢిల్లీ : దేశంలో తెలంగాణ స‌హా ఏడు రాష్ర్టాలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయ‌ని నిజామాబాద్ ఎంపీ క‌విత అన్నారు. గురువారం లోక్ స‌భ‌లో ఆమె మాట్లాడుతూ కరువు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు ఉపాధిహామీ పథకం కింద పని దినాలను 200 రోజులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

12/03/2015 - 15:37

చెన్నై: భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై-గూడూరు సెక్షన్‌ వద్ద రైల్వే వంతెనపై ప్రమాదస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో పలు రైళ్లు రద్దుకాగా, మరికొన్ని రైళ్లను దారిమ మళ్లించినట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.

Pages