S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/03/2015 - 15:34

చెన్నై : ఇప్పటికే భారీ వర్షాలకు అతలకుతలమైన చెన్నై నగరానికి, తమిళనాడు రాష్ర్టానికి వాతావరణశాఖ మరో హెచ్చరిక చేసింది. 48 గంటల్లో రాజధాని చెన్నైతోపాటు తమిళనాడులో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

12/03/2015 - 14:10

చెన్నై : నీట మునిగి సాయం కోసం ఎదురుచూస్తున్న తమిళనాడు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నైలో దాదాపు 2400 మందిని రక్షించామని ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఓపీ సింగ్ వెల్లడించారు. దాదాపు 400 మందిని వైమానిక దళ సభ్యులు రక్షించి హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 70 వేల మందిని రక్షించామని చెన్నై కమిషనర్ తెలిపారు.

12/03/2015 - 14:10

న్యూఢిల్లీ : తమిళనాడులో పరిస్థితి గంభీరంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడును అన్నివిధాల ఆదుకుంటామని చెప్పారు. ఆపద సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, రాజకీయాలు వద్దని హతవు పలికారు.

12/03/2015 - 13:22

న్యూఢిల్లీ : భారత సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్ ఠాకూర్ 2017 జనవరి 3వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

12/03/2015 - 13:10

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత వరద బాధిత ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం ఏరియల్ సర్వే నిర్వహించారు. సుమారు 40 నిమిషాలు పాటు జయ సర్వే నిర్వహించారు. వరద నష్టంపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

12/03/2015 - 13:10

చెన్నై: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు, వరద వల్ల 269 మంది చనిపోయినట్లు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లోకసభలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సహాయ చర్యల కోసం 30 ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు రంగంలోకి దిగాయన్నారు. చెన్నై రైల్వే స్టేషన్‌లో నీరు చేరడంతో ఆ స్టేషన్‌ను మూసివేశారన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు మరింత సాయం అందిస్తామని ఆయన అన్నారు.

12/03/2015 - 11:37

హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు అన్ని విధాలా సాయం అందిస్తామని ఎ.పి. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆయన గురువారం తమిళనాడు సిఎం ముఖ్య కార్యదర్శితో, సిఎస్‌తో ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో జలాశయాల నుంచి వరద నీటిని విడుదల చేయడాన్ని ఆపాలని తమిళనాడు సిఎస్ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కృష్ణారావు తెలిపారు.

12/03/2015 - 11:36

చెన్నై: భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం నీట మునగడంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. పాలు, కూరగాయలను అధిక ధరలకు కొందామన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు, ఎటీఎంలు నీట మునగడంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. చేతిలో నగదు లేకపోవడంతో ప్రభుత్వం అందించే ఆహార పొట్లాల కోసం జనం ఎదురు చూస్తున్నారు.

12/03/2015 - 06:39

లీ బౌర్గెట్, డిసెంబర్ 2: వాతావరణ మార్పులపై అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోడానికి ఇక్కడ సమావేశమైన ప్రపంచ దేశాల నేతలందరూ ఓపక్క చర్చలు జరుపుతుండగా, వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నాటికల్లా 200 బిలియన్ డాలర్ల సాయం అందించడానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలని భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా దేశాలు సభ్యులుగా ఉన్న ‘బేసిక్’ దేశాలు అభ

12/03/2015 - 05:50

చెన్నై, డిసెంబర్ 2: కొద్ది రోజులుగా కనీవినీ ఎరుగని రీతిలో ఎడతెరిపి లేకుండాకురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై మహానగరం అంతా వరద నీటిలో మునిగిపోయి ద్వీపకల్పాన్ని తలపిస్తుండగా, చుట్టుపక్కల తీరప్రాంత జిల్లాలు సైతం వరుణుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి. రైలు, రోడ్డు సదుపాయాలతో పాటుగా విమాన సర్వీసులు సైతం నిలిచిపోవడంతో చెన్నై నగరానికి బాహ్య ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి.

Pages