S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/17/2019 - 02:38

పుదుచ్చేరి, ఫిబ్రవరి 16: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి వి.నారాయణ సామి శనివారం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని తన మద్దతుదారులను కోరారు.

02/17/2019 - 02:30

ఆర్తనాదాలు, రోదనలు, ప్రతీకారాగ్నులు, శోకతప్త నివాళుల మధ్య వీర జవాన్ల అంత్యక్రియలు జరిగాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు శవపేటికలు మోస్తూ జవాన్లకు ఘన నివాళులర్పించారు. దాదాపు అన్నిచోట్లా వేల సంఖ్యలోనే ప్రజలు హాజరై వీర సైనికుల త్యాగాలను శ్లాఘించారు. మరోపక్క బాధిత కుటుంబాల బాధ వర్ణణాతీతమే అయింది. ఎవరెంతగా ఊరడించినా..యావద్భారతం అండగా నిలిచినా ఆ కుటుంబాల్లో వేదనను చల్లార్చడం ఎవరితరం కాలేదు.

02/17/2019 - 02:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశ రక్షణ, భద్రత విషయంలో భద్రతా బలగాలకు యావత్ భారతదేశం అండగా ఉంటుందని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన శనివారం పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ పాల్గొన్నారు.

02/17/2019 - 02:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఉగ్రవాదులకు తగిన సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి జితేందర్‌రెడ్డి హాజరయ్యారు.

02/17/2019 - 01:58

ముంబయి, ఫిబ్రవరి 16: కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన భయానక ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున విరాళాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ బాధిత కుటుంబాలకు అందించనున్నట్టు ఆయ న వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆయా కుటుంబాలకు ఏవిధంగా అందజేయాలన్నదానిపై అమితాబ్ దృష్టి పెట్టారని వార్తలు వెలువడుతున్నాయి.

02/17/2019 - 01:34

చిత్రం..రాజస్థాన్‌లోని పోఖరాన్ వద్ద ‘వాయుశక్తి’ పేరుతో శనివారం నిర్వహించిన ప్రదర్శనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డమీ టార్గెట్‌లను ధ్వంసం చేస్తున్న దృశ్యం

02/17/2019 - 01:27

యవత్మాల్ (మహారాష్ట్ర), ఫిబ్రవరి 16: ఉగ్రవాదానికి ప్రోత్సహమిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులను చిత్తుచేస్తామని, ఈ విషయమై భద్రతా బలగాలకు స్వేచ్ఛనిచ్చామని, ప్రజలు సహనంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రవాద దాడి ఘటన దేశ ప్రజలను కలచివేసిందని, ఈ దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించి తీరుతామని ఆయన అన్నారు.

02/17/2019 - 01:25

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఆర్థికంగా మరింత తీవ్ర చర్యలు చేపట్టింది. అత్యంత ప్రాధాన్య దేశం (ఎమ్‌ఎఫ్‌ఎన్) హోదా నుంచి పాక్‌ను తప్పించిన భారత్ ఆ దేశం నుంచి ఇక్కడికి జరిగే దిగుమతులపై సుంకాన్ని 200శాతం పెంచింది.

02/17/2019 - 01:43

జమ్మూ: భారత్ పాక్ వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన పేలుళ్లలో ఒక ఆర్మీ మేజర్ మరణించగా, మరో జవాను గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూలోని రాజౌరి జిల్లా వద్ద జరిగింది. ఈ మందుపాతర్లను పాకిస్తాన్ సైనికులు అమర్చి ఉంటారని పోలీసులు చెప్పారు. భారత సరిహద్దులోపల నౌషీరియా సెక్టార్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. గస్తీలో ఉన్న వాహనం మందుపాతర్లు అమర్చిన ప్రదేశం మీదుగా వెళుతుండగా, ఈ పేలుళ్లు సంభవించాయి.

02/17/2019 - 01:21

అత్యంత పాశవికంగా భారత జవాన్లపై విరుచుకుపడిన ఉగ్రవాదుల దుశ్చర్యను యావద్భారతం తీవ్రస్థాయిలో నిరసించింది. అదే స్థాయలో అమరులైన జవాన్లకు నివాళులర్పించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల ఆత్మ శాంతించాలని భోపాల్‌లో జవాన్లు, పౌరులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
చిత్రాలు.. అలహాబాద్‌కు చెందిన అమర జవాన్ ముఖేష్ యాదవ్ భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుమార్తె.

Pages