S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/15/2018 - 01:06

భోపాల్, డిసెంబర్ 14: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 17వ తేదీన సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆనందబెన్ ఈ మేరకు కమల్‌నాథ్‌కు ఆహ్వానం పంపారు. 72 ఏళ్ల కమల్‌నాథ్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. శుక్రవారం ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఆనందబెన్‌ను కలిశారు.

12/15/2018 - 01:04

హైదరాబాద్, డిసెంబర్ 14: స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఓ ఇంటివారయ్యారు. వీరి పెళ్లి శుక్రవారం ఇక్కడ జరిగింది. గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేశారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ పొందిన నెహ్వాల్, కశ్యప్ ఒకర్నొకరు ఇష్టపడ్డారు.

12/15/2018 - 00:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై, రక్షణ శాఖపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తనంతరం రెండు తెలుగురాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ, కే లక్ష్మణ్, పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఢిల్లీలో మీడియాతో విడివిడిగా మాట్లాడారు.

12/15/2018 - 00:52

హైదరాబాద్, డిసెంబర్ 14: కేంద్రప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మెకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సీఐటీయూ నేత సోమన్న మాట్లాడుతూ కార్మిక హక్కులకు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

12/14/2018 - 23:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రధాని మోదీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ రాఫెల్ ఒప్పందంపై ఆయన ప్రభుత్వం ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అక్రమాలు జరిగాయని, దానిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్లన్నీ సుప్రీం కోర్టు కొట్టివేసింది.

12/14/2018 - 23:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ సంవత్సరం జ్ఞానపీఠ అవార్డును ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్‌కు ప్రకటించారు. ఆయన రచించిన ‘అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ లిటరేచర్’ అనే రచనకు 54వ జ్ఞానపీఠ అవార్డును అందజేస్తున్నట్టు భారతీయ జ్ఞానపీఠ్ శుక్రవారం ప్రకటించింది. జ్ఞానపీఠ ఎన్నిక కమిటీ చైర్మన్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభారాయ్ ఆధ్వర్యంలో సమావేశమై రాయ్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

12/14/2018 - 22:29

అహ్మదాబాద్, డిసెంబర్ 14: గుజరాత్‌లో స్థిరపడిన 83 మంది పాకిస్తానీ హిందువులకు కేంద్రం పౌరసత్వాన్ని మంజూరు చేసింది. వీరు అనేక సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుంచి వలస వచ్చి అహ్మదాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విక్రాంత్ పాండే, ఎమ్మెల్యే బైరాం థావనీ వీరికి ధృవీకరణ పత్రాలు అందచేశారు.

12/14/2018 - 22:27

జైపూర్, డిసెంబర్ 14: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్‌డ్ సీట్లలో బీజేపీకి చేదుఫలితాలే వచ్చాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 59 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 50 రిజర్వ్‌డ్ స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఇటీవల ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లోనే గెలిచింది. గత ఎన్నికల్లో 32 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 12 సీట్లే దక్కించుకుంది.

12/14/2018 - 22:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్, రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్ కార్యదర్శి అనిల్ కె ధాష్మాన పదవీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదవీ కాలం వచ్చే నెలతో పూర్తి కావాల్సి ఉంది. రాజీవ్ జైన్ పదవీకాలం డిసెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ధాఊమన పదవీకాలం డిసెంబర్ 29తోముగుస్తుంది.

12/14/2018 - 22:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మోదీసర్కార్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా సుప్రీం కోర్టు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన ఈ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని పునరుద్ఘాటించారు.

Pages