S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/18/2019 - 04:08

పాండిచ్చేరి, ఫిబ్రవరి 17: కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు తారా స్ధాయికి చేరాయి. ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పేదలకు ఉచిత బియ్యం వంటి పలు సంక్షేమ పథకాలు, పాలనాపరమైన పలు అంశాలతో కూడిన ప్రతిపాదనలు తాను సమర్పిస్తే వాటిని ఆమోదించకుండా కిరణ్‌బేడీ కావాలని జాప్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి వీ.

02/18/2019 - 03:31

భద్రక్ (ఒడిసా), ఫిబ్రవరి 17: ప్రధాని నరేంద్ర మోదీపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. దేశ చౌకీదార్ చోర్ కాదని, స్వచ్ఛత, సచ్ఛీలతకు ప్రతీక అని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో అన్నారు. నిజాయితీ, సమర్థ పనితీరుకు ప్రతీక అయిన మోదీ లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ప్రధానిగా దేశానికి సేవ చేస్తారని అన్నారు.

02/18/2019 - 03:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ఎదురుదాడికి దిగారు. రాహుల్ గాంధీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఎద్దేవా చేయడం ద్వారా భారతదేశ మేధోసంపత్తిని, కఠోర పరిశ్రమను అవమానించారని ఆయన పేర్కొన్నారు.

02/18/2019 - 00:50

శ్రీనగర్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఆరుగురు వేర్పాటువాద నేతలకు ఇచ్చిన ప్రత్యేక భద్రతను ప్రభుత్వం ఆదివారం ఉపసంహరించుకుంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ వేర్పాటువాదులుగా ముద్రపడిన ఏ నేతకూ ఇకపై ప్రత్యేక భద్రతా సౌకర్యాలు ఉండబోవని స్పష్టం చేసింది.

02/18/2019 - 00:49

చెన్నై, ఫిబ్రవరి 17: క్రియాశీల రాజకీయాల్లోకి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అడుగుపెట్టడంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. రజనీ మక్కల్ మండ్రం పార్టీని రజనీకాంత్ స్థాపించినప్పటికీ ఇంతవరకు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. రెండు మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుందని వస్తున్న వార్తలకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు.

02/18/2019 - 00:43

బరౌనీ (బీహార్), ఫిబ్రవరి 17: భారత జవాన్లపై పాకిస్తాన్ మిలిటెంట్ సంస్థ జరిపిన అమానుష దాడి వరుసగా మూడోరోజు కూడా యావద్భారతాన్ని రగిలిస్తూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్న మాటలే ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలకు అద్దం పట్టాయి. ‘ఆవేదన, ఆగ్రహంతో నా గుండె రగిలిపోతోంది. పుల్వామాలో 40 మంది భారత జవాన్లు మిలిటెంట్ దాడిలో మరణించడంపై మీ గుండెల్లో ఎలాంటి మంటలు రగులుతున్నాయో..

02/17/2019 - 05:31

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం దేశంలో ప్రత్యేకించి జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. రెండు రోజుల క్రితం గురువారం కాశ్మీర్‌లోని పుల్వామాలో జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ జరిపిన భయంకరమయిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో హోంమంత్రి దేశంలో భద్రతా పరిస్థితులను సమీక్షించారని అధికారులు తెలిపారు.

02/17/2019 - 05:26

జగదల్‌పూర్ (చత్తీస్‌గఢ్): కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం బడాపారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసి, రైతులకేమో రోజుకు రూ.3.50 పైసల చొప్పున వ్యవసాయ రంగంలో ఆర్థిక సాయం చేయడం పెద్ద దగా అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కోట్లకు పడగలెత్తిన అనిల్ అంబా నీ, విజయ్ మాల్యా పట్ల మోదీ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచిపెడుతోందన్నారు.

02/17/2019 - 02:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించిన ప్రతిష్టాకరమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శనివారం సాంకేతిక లోపాలతో ఆలస్యంగా ఢిల్లీకి చేరుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కోచ్‌లను తయారు చేశారు. ఈ రైలు గంటకు 180కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు సాంకేతిక కారణాల వల్ల చివరకు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరుకుంది.

02/17/2019 - 02:41

జమ్మూ, ఫిబ్రవరి 16: జమ్ములో వరుసగా రెండవ రోజు కూడా కర్ఫ్యూను విధించారు. పుల్వానా ఘటన సంభవించిన వెంటనే నగరంలో అల్లర్లు జరిగాయి. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూను విధించారు. నగరంలో పోలీసు కవాతును నిర్వహించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను నియమించారు. జమ్మువిశ్వవిద్యాలయంలో ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలను వాయిదా వేశారు.

Pages