S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/12/2016 - 17:54

ఛత్తీస్‌గడ్‌ : భారత్‌లో యువ శక్తి అధికంగా ఉందని, ప్రోత్సహిస్తే యువతదేన్నైనా సాధిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రస్తుతం జాతిని నిలబెట్టేందుకు యువత శ్రమిస్తోందని చెప్పారు.

01/12/2016 - 17:53

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన 178 మంది మత్య్సకారులను విడుదల చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. తమ జలాల్లోకి ప్రవేశించారని బంగ్లాదేశ్‌ అధికారులు వీరిని రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. బగెర్‌హత్‌ జైలులో ఉన్న మత్స్యకారులను ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో విడుదల చేసినట్లు సంబంధిత శాఖ సహాయ మంత్రి ప్రకటించారు.

01/12/2016 - 17:52

చెన్నై : జల్లికట్టుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తమిళనాడు సీఎం జయలలిత లేఖ రాశారు. ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు.

01/12/2016 - 16:33

చెన్నై : తమిళనాడులో ఏర్పాటుచేసిన ఈ-సేవా కేంద్రాలను సీఎం జయలలిత మంగళవారంనాడు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆమె ఈ కేంద్రాలను ప్రారంభించారు. కరెంటు బిల్లులు, పన్నులు కట్టడం, జనన,మరణ ధృవీకరణ పత్రాలను పొందవచ్చని ఆమె తన ప్రకటనలో వెల్లడించారు.

01/12/2016 - 14:11

ఢిల్లీ : దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 12న జరుగనున్నది. 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ నెల 20 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

01/12/2016 - 14:10

ఢిల్లీ : పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానికి స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ను రెండో రోజూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారించింది. సల్వీందర్ సింగ్ పొంతనలేని సమాధానాలు చెప్పటంతో ఆయనకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే సల్వీందర్ వంట మనిషి మదన్ గోపాల్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.

01/12/2016 - 14:10

పంజాబ్ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్‌లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందటంతో అదనపు భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే పఠాన్‌కోట వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే.

01/12/2016 - 14:09

ఢిల్లీ : తమిళనాడులో పొంగల్‌కు పెద్దఎత్తున నిర్వహించే జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జల్లికట్టు నిర్వహణకు కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయం విదితమే. ఈ సంప్రదాయ విధానం జంతువులను హింసించటమేనని జంతు సంరక్షణ బోర్డు, పెటా, బెంగుళూరుకు చెందిన స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

01/12/2016 - 14:08

ఢిల్లీ : ఢిల్లీలోని మండోలి ప్రాంతంలోని గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 20 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.

01/12/2016 - 14:03

పంజాబ్ : గురుదాస్‌పూర్‌లో స్కూల్ బస్సు లోయలోపడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా, 12మందికి గాయాలయ్యాయి. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించింది.

Pages