S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/15/2019 - 04:40

ఏరోడ్, ఫిబ్రవరి 14: దేశంలో ప్రతిపక్ష పార్టీలకు దిశ, దశ లేదని, సరైన నాయకుడు లేరని, విధి విధానాలు లేవని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ చేనేత, మరమగ్గాల కార్మికుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి బలమైన సిద్ధాంతం, సమర్థమైన నాయకత్వం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మంచి మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందన్నారు.

02/15/2019 - 04:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయే ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి దేశాల మధ్య ఒప్పదం ఉండాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

02/15/2019 - 04:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన పీఎం-కిసాన్ పథకాన్ని ప్రధాని మోదీ త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. 75వేల కోట్ల రూపాయలతో కోటిమంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ రెండు వేల రూపాయలను యూపీలోని గోరఖ్‌పూర్‌లో రైతులకు ఆయన ఈనెల 24న అందజేస్తారు.

02/15/2019 - 04:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతే తమ కూటమి నాయకుడు ఎవరనేది నిర్ణయిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఢిల్లీలో గురువారం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మమత మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో పొత్తులు ఎలా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

02/15/2019 - 04:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన జీవన విధానాలు అవలంభించే విధంగా వైద్యులే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైనె్సస్ ఆరో సమావేశాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు.

02/15/2019 - 01:33

వల్సద్, ఫిబ్రవరి 14: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారులపై మోపిన ‘గబ్బర్ సింగ్ టాక్స్’ను తొలగించి, నిజమయిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తీసుకొస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

02/15/2019 - 01:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కేంద్ర ప్రభుత్వం గత అయిదేళ్లలో ఎలక్ట్రానిక్ మీడియాలో తన ప్రచారం కోసం రూ. 2,374 కోట్లు, ఔట్‌డోర్ పబ్లిసిటీ కోసం రూ. 670 కోట్లు వ్యయం చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ సమాచార హక్కు (ఆర్‌టీఐ) కింద దాఖలయిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.

02/15/2019 - 01:03

అహ్మద్‌నగర్: సామాజిక ఉద్య మకారుడు అన్నా హజారే స్వల్ప అస్వస్థతతో గురువారం ఆసుపత్రిలో చేరారు. ఆయన మెదడుకు సరిగ్గా రక్తం సరఫరా కాకపోవడంతో నీరసం రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు డాక్టర్లు తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటు తదితర డిమాండ్లతో అన్నాహజారే గతవారం వారం రోజుల పాటు నిరవధిక నిరశన చేపట్టిన విషయం తెలిసిందే.

02/15/2019 - 00:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: జమ్ముకాశ్నీర్‌లోని పుల్‌వామా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి చేసి దాదాపు మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై చేసిన దాడిని ఊరికే పోనివ్వమని నరేంద్ర మోదీ తమ ట్వీట్ సందేశంలో స్పష్టం చేశారు.

02/15/2019 - 00:18

శ్రీనగర్, ఫిబ్రవరి 14: జమ్ముకాశ్మీర్ మరోసారి రక్తసిక్తమైంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు జరిపిన పాశవిక ఆత్మాహుతి దాడిలో 42మంది సిఆర్‌పిఎఫ్ సైనికులు మరణించారు. దాదాపు 350కిలోల పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పుల్వాలా జిల్లాలోని అవంతిపురలో ఈ భయానక ఘాతుకానికి పాల్పడ్డారు.

Pages