S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/14/2019 - 17:17

జమ్మూకాశ్మీర్: పూల్వామా జిల్లాలోని అవంతిపురంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్‌కి చెందిన 12మంది జవాన్లు మృతిచెందారు. వీరు వెళుతున్న వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ పేలుడు కోసం ఐఈడీ వాడినట్లు తెలుస్తుంది.

02/14/2019 - 16:49

అజ్మీరా: మోదీలోని ద్వేషాన్ని ప్రేమతో ఓడించగలిగానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన అజ్మీరాలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ పార్లమెంటులో తనను, తన కుటుంబ సభ్యులను, కాంగ్రెస్ పార్టీని ద్వేషంతో అవమానించినా.. తాను ప్రేమతో ఆలింగనం చేసుకున్నానని అన్నారు. మోదీ తనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తల రుణాలను రద్దుచేశారని అన్నారు.

02/14/2019 - 16:48

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బీద పలుకులు పలుకుతూ ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. ప్రజాధనంతో సోకులు చేసుకుంటున్నారని అన్నారు.

02/14/2019 - 16:47

న్యూఢిల్లీ: మాతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎనాడు వ్యతిరేకించలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆయన సుప్రీం తీర్పుపై మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాము పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. అధికారాల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని అన్నారు.

02/14/2019 - 12:49

లక్నో: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానం ఆచరించారు. ఆయన గంగా యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి యోగి, మరికొంత మంది సాధువులతో కలిసి స్నానమాచరించారు. ఆ తరువాత నదికి హారతి ఇచ్చారు. జునా అఖాడా ఆశ్రమంలో స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం యోగితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

02/14/2019 - 12:47

న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్‌మాల్యా ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిన్న లోకసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఓ వ్యక్తి 900 కోట్ల రూపాయలు తీసుకుని విదేశాలకు పారిపోయాడని అన్నారు. ఆ మాటలు తనను ఉద్దేశించి చేసినవేనని మీడియా ద్వారా తెలుసుకున్నాను.

02/14/2019 - 12:46

లక్నో: యూపీలో ఓబీసీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ఆ పార్టీ తూర్పు విభాగం ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ అన్నారు. ఓబీసీ మహాన్‌దళ్ పార్టీ అధినేత వౌర్యాజీకి స్వాగతం పలుకుతున్నానని ప్రియాంక ప్రకటించారు. యూపీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిథ్యం కల్పించాలనే రాహుల్ ఆలోచనలలో భాగంగా మేం కలిసి పోరాడతాం అని అన్నారు.

02/14/2019 - 12:45

పుదుచ్చేరి: గవర్నర్ కిరణ్‌బేడీ వ్వవహారశైలిపై రోడ్డెక్కిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి నిన్న ఉదయం నుంచి గవర్నర్ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్నారు. రాత్రి కూడా ఆయన గవర్నర్ నివాసం ఎదుట నిద్రించారు. హెల్మెట్ నిర్బంధ అమలు చట్టం, ఇతర పాలనా వ్యవహారాలలో ఆమె జోక్యం చేసుకుంటున్నారని సీఎం అసంతప్పితో ఉన్నారు.

02/14/2019 - 12:44

న్యూఢిల్లీ: ఢిల్లీ అధికారాలపై సుప్రీం కోర్టు గురువారంనాడు తీర్పునిచ్చింది. జస్టిస్ సిక్రి, జస్టిస్ అశోక్‌భూషన్‌తోకూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అవినీతి నిరోధక శాఖ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేతిలో ఉంటుందని పేర్కొంది. అలాగే పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేదని స్పష్టం చేసింది. ఇక విచారణ కమిటీ కేంద్రం ఆధీనంలోనే పనిచేస్తుందని తెలిపింది.

02/14/2019 - 05:07

న్యూఢిల్లీ: పదహారవ లోక్‌సభ ఆఖరు రోజు బుధవారం దద్దరిల్లిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సీపీఎం సభ్యుడు మహమ్మద్ సలీంను కొట్టినంత పని చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేద ప్రజలను నిలువునా ముంచిన శరదా చిట్‌ఫండ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, టీఎంసీ లోక్‌సభ సభ్యులు సగం మంది జైల్లో ఉండాల్సిన వారంటూ సలీం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.

Pages