S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/14/2019 - 05:05

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆయన త్వరలోనే మాజీ అవుతారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో ఏన్డీఏ ప్రభుత్వం మరో 80 రోజులు మాత్రమే ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

02/14/2019 - 04:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వ అన్ని విధాలుగా రాష్ట్రానికి అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆరోపించింది. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనాచౌదరి విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేయాలంటూ అన్ని విధాలుగా పోరాటాలు చేశామని చెప్పారు.

02/14/2019 - 04:40

శ్రీనగర్, ఫిబ్రవరి 13: కాశ్మీర్ లోయలో మంగళవారం రాత్రి నుంచి హిమపాతంతో పాటు వర్షాలు కురుస్తున్నాయని, దీని కారణంగా కనీస ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయని, వచ్చే రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గుల్‌మార్గ్, పహల్గామ్‌తో పాటు కుప్వరా ప్రాంతాల్లో తాజాగా హిమపాతం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

02/14/2019 - 04:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య అగాధం సృష్టించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితవు పలికారు.

02/14/2019 - 04:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మనదేశంలో హెలికాప్టర్ రవాణా రంగంపై దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టే సరైన కంపెనీలు లేవని అందుకే ఈ రంగంలో వ్యాపార అవకాశాలు అంతగా మెరుగ్గా లేవని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు.

02/14/2019 - 04:34

జైపూర్, ఫిబ్రవరి 13: రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో గుజ్జర్లకు, ఇతర సామాజిక వర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేబిల్లును ప్రవేశపెట్టింది. కాగా గుజ్జర్లు చేస్తున్న ఆందోళనను ఇంకా విరమించలేదు. ఈ విషయమైప్రభుత్వం నుంచి కచ్చితమైన ప్రతిపాదనలు తమ దృష్టికి రాలేదన్నారు. ముందుగా అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందితే, ఆందోళన విరమించే సంగతి ఆలోచిస్తామని గుజ్జర్ల సంఘం న ఏత కిరోరి సింగ్ బైన్సియా తెలిపారు.

02/14/2019 - 04:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: సీబీఐ గత మూడు సంవత్సరాల్లో 4100 మంది ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. 4123 ప్రభుత్వ ఉద్యోగులపై 2016 నుంచి 2018 వరకు 1767 అవినీతి కేసులను సీబీఐ నమోదు చేసిందన్నారు. ఇందులో 900 కేసుల్లో చార్జిషీటును దాఖలు చేశారు. శాఖాపరమైన చర్యలకు సంబంధించి 59 కేసులను సిఫార్సు చేశారు.

02/14/2019 - 04:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా వృధా అయ్యాయని, ప్రజల కు సేవచేసే మరో అవకాశాన్ని చేజార్చుకున్నామని చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాజ్యసభను పూర్తిగా స్తంభింపజేసేందుకు కొందరు సభ్యులు పెద్ద ఎత్తున ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు సభ్యులను సభ నుంచి బయటకు పంపాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

02/14/2019 - 00:35

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కూటమిని ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రతిపక్ష కూటమి నాయకులు ప్రకటించారు. బుధవారం రాత్రి ప్రతిపక్ష మహా కూటమి నాయకులు ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్ నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు.

02/14/2019 - 00:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాఫెల్ డీల్‌లో కేంద్రం అవకతవకలకు పాల్పడిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాఫెల్ ఒప్పందంలో కేంద్రం తొందరపాటుతో వ్యవహరించడం, పారదర్శకత లేని విధానాల వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందనే తమ అభియోగం రుజువైందన్నా రు. ఈ ఒప్పందంలో ఉన్న నిబంధనలు యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందం తో పోల్చితే అంత మెరుగైనవి కావని ఒక మీడియాలో వెలువడిన డాక్యుమెంట్ రుజు వు చేస్తోందన్నారు.

Pages