S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/12/2019 - 06:02

మొరాదాబాద్ (యూపీ), ఫిబ్రవరి 11: దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది ప్రధాని మోదీ ఒక్కరేనని, అన్ని రుగ్మతలకు సర్వరోగ నివారిణి ఆయనేనని, అందుకే ఆయనను వచ్చే ఎన్నికల్లో తిరిగి గద్దెనెక్కించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు.

02/12/2019 - 05:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భార్యగా, తల్లిగా అత్యుత్తమ బాధ్యతలు నిర్వర్తించిన ప్రియాంక గాంధీ దేశ సేవకు అంకితం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి యూపీలో రోడ్‌షోకు ప్రియాంక దిగిన నేపథ్యంలో వాద్రా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

02/12/2019 - 05:50

అలహాబాద్, ఫిబ్రవరి 11: యూపీలో అధికార బీజేపీ, సమాజ్‌వాదీ నేతల మధ్య కుంభమేళా మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సారధ్యంలో జరుగుతున్న కుంభమేళాలో స్వచ్ఛత కనిపించడం లేదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మొహిసిన్ రజా విరుచుకుపడ్డారు.

02/12/2019 - 05:49

తిరువనంతపురం, ఫిబ్రవరి 11: శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ పరిసరాల్లో మరోసారి ఉత్కంఠ పూరిత వాతావరణ నెలకొంది. నెలవారీ పూజల నిమిత్తం మంగళవారం ఆలయం తెరుచుకోనుంది. వార్షిక పూజల నిమిత్తం ఇటీవల శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు, నిరసనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు మహిళలు అయప్ప ఆలయ ప్రవేశం చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది.

02/12/2019 - 06:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: వాతావరణంలో నిత్యం చోటుచేసుకుంటున్న పెనుమార్పుల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై అధికంగా ఉంటుందని, దీనిని సమష్టిగా ఎదుర్కోవడానికి అన్ని దేశాలు పరస్పరం సహాయం, సహకారం అందించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు.

02/12/2019 - 01:32

న్యూఢిల్లీ: హోదా కోసం శ్రీకాకుళం జిల్లా కింతని ప్రాంతానికి చెందిన దివ్యాంగుడైన దావాల అర్జున్ రావు(40) సోమవారం ఢిల్లీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్న ఆంధ్రాభవన్ ముందున్న జశ్వంత్‌సింగ్ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై వీల్‌చైర్‌లో విగతజీవిగా ఉదయం అర్జున్‌రావు పడివున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

02/12/2019 - 01:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి తీరాల్సిందేనని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన ధర్మ పోరాట దీక్షా కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రతిపాదన పార్లమెంటు ముం దుకు వచ్చినప్పుడు అన్ని పార్టీలు మద్ద తు ఇచ్చాయని గుర్తుచేశారు.

02/12/2019 - 01:29

లక్నో, ఫిబ్రవరి 11:‘సరికొత్త భవితవ్యం నిర్మించుకుందాం..కొత్త రాజకీయాలకు నాంది పలుకుదాం..’అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ వీధుల్లో స్వైర విహారం చేశారు. దాదాపు నాలుగు గంట ల పాటు పాతిక కిలోమీటర్ల మేర సాగిన ప్రి యాంక-రాహుల్ రోడ్‌షో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం రగిలించింది.

02/12/2019 - 01:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాన మంత్రి పార్లమెంటులో ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేయకపోవటం సిగ్గు చేటని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ఈయన ఎలాంటి ప్రధాన మంత్రి’ అంటూ నిప్పులు చెరిగారు.

02/12/2019 - 01:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పలు రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ బాధపడుతుంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ నీచంగా, అధర్మంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రత్యేక హోదా లభించక మనం బాధ పడుతుంటే, ఆయన మాత్రం సంతోషిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.

Pages