S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/03/2019 - 12:34

తిరువనంతపురం: శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేరళలో బంద్ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకోవటం పట్ల రాష్టవ్య్రాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల టైర్లను తగులబెట్టారు. వాణిజ్య సముదాయాలను మూసివేశారు. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా జనజీవనం స్తంభించింది.

01/03/2019 - 04:12

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుండి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై తనతో ఇరవై నిమిషాల పాటు ముఖాముఖి చర్చ జరపడానికి సిద్ధమా అని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పార్లమెంటులో బుధవారం రాఫెల్ యుద్ధ విమానాలపై చర్చ జరిగిన అనంతరం రాహుల్ ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ సవాల్ చేయటం గమనార్హం.

01/03/2019 - 02:48

భోపాల్, జనవరి 2: మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున వందేమాతరాన్ని ఆలపించే సంప్రదాయంపై నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు విధింన తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవ దినాన ఆ గీతాన్ని ఆలపించి తీరుతారని స్పష్టం చేశారు.

01/03/2019 - 02:47

చిత్రం..ఢిల్లీలో కాలుష్యంతో కూడిన దట్టమైన పొగమంచులోనూ యమునా నది ఒడ్డును ఆటాడుతున్న ఓ బాలుడు

01/03/2019 - 02:44

న్యూఢిల్లీ, జనవరి 2: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వెనకున్న ముడుపుల వ్యవహారం బయటపడాలంటే జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)తో దర్యాప్తు జరిపించవలసిందేనని తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ జయదేవ్ ఈ డిమాండ్ చేశారు.

01/03/2019 - 02:42

న్యూఢిల్లీ, జనవరి 2: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రాకుండానే బుధవారం రాజ్యసభ వాయిదా పడింది. కావేరీ నదిపై కర్నాటక నిర్మిస్తున్న అనకట్టకు వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు పదే పదే రాజ్యసభ చైర్మన్ పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో సభ పలుమార్లు వాయిదా పండింది.

01/03/2019 - 02:41

న్యూఢిల్లీ, జనవరి 2: లోక్‌సభలో గత నెల ఎనిమిదో తేదీనుండి పోడియం వద్ద గొడవ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న 24 మంది అన్నాడీఎంకే సభ్యులను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదు రోజుల పాటు సభనుండి సస్పెండ్ చేశారు.

01/03/2019 - 02:40

న్యూఢిల్లీ, జనవరి 2: ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ హోదా సాధన సమితి నేతృత్వంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్యాయం చేశారని ఆరోపించారు.

01/03/2019 - 02:40

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రధాని నరేంద్ర మోదీ తన మొండి వైఖరితో దేశంలోని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కూడా ఆ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో అవరణలోని గాంధీ విగ్రహం, ప్రధాన ద్వారం వద్ద తమ నిరసనను కోనసాగించారు.

01/03/2019 - 02:39

న్యూఢిల్లీ, జనవరి 2: ఆంధ్రప్రదశ్ నూతన హైకోర్టు భవనాల నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్లమెంట్ అవరణలో ప్లకార్డు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.

Pages