S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/02/2019 - 12:48

జయపుర (రాజస్థాన్): ఎన్డీఏ ప్రభుత్వ చర్యలకు నిరసనగా త్వరలో రైతులతో ర్యాలీ నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో రైతుల రుణాలను మాఫీ చేశామని, ఈ పక్రియ వేగవంతంగా జరుగుతుందని అన్నారు.

01/02/2019 - 12:46

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విభజించారని ఎంపీ అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు.

01/02/2019 - 04:17

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షం ఏర్పాటు చేస్తున్న మహాకూటమి విఫలం కాకతప్పదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినట్లే లోక్‌సభ ఎన్నికల్లోనూ మహాకూటమి ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం ఒక జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.

01/02/2019 - 04:18

కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో కోటి ఆశాకిరణాల ఆలంబనగా యావత్ ప్రపంచం
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. న్యూఢిల్లీ నుంచి శాన్‌ప్రాన్సిస్‌కో వరకు అన్ని నగరాలు
కొత్త సంవత్సర ఆరంభ వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నాయి.
ఇటు సంప్రదాయం.. అటు ఆధునికత మేళవించిన రీతిలో విశ్వశ్రేయస్సును శాంతిని కాంక్షిస్తూ
భిన్న రీతుల్లో గగనతలం ఈ స్వాగత తోరణాలు కట్టుకుంది.

01/02/2019 - 03:33

న్యూఢిల్లీ, జనవరి 1: భారత్‌లో నూతన సంవత్సరం తొలి రోజు 68,933 మంది శిశువులు జన్మించనున్నట్లు యూనిసెఫ్ ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కువ మందికి జనవరి 1వ తేదీన జన్మనిచ్చిన దేశం భారత్ కావడం విశేషమని యూనిసెఫ్ పేర్కొంది. చైనాలో 44940 మంది జన్మించనున్నారు. నైజీరియాలో 25,685 మంది ఉన్నారు. శిశువుల దత్తత, వారి హక్కులను ప్రవేశపెట్టి ఈ ఏడాదికి ముప్పై ఏళ్లు గడిచాయి.

01/02/2019 - 02:42

న్యూఢిల్లీ, జనవరి 1: దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకానికి విశేష స్పందన వస్తోందని, ఈ స్కీంను ప్రవేశపెట్టిన తొలి వంద రోజుల్లో 6.85 లక్షల పేద ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జాతీయ ఆరోగ్య విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రతి రోజూ ఐదు వేల క్లైమ్స్‌ను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.

01/02/2019 - 02:42

నూతన సంవత్సర ఆరంభ వేడుకల్లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్‌లోని ఓ చర్చి వెలుపల
బెలూన్‌లు ఎగురవేస్తూ సంబరాల్లో మునిగితేలుతున్న నగరవాసులు

01/02/2019 - 02:40

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాటల రచయిత, స్క్రిప్ట్ రైటర్ ఖాదర్‌ఖాన్ (81) కెనడాలోని టొరంటోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసారు. సుదీర్ఘకాలం శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ కోమాలోకి వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు ఆయన కుమారుడు సర్ఫరాజ్ వెల్లడించారు.

01/02/2019 - 02:37

న్యూఢిల్లీ, జనవరి 1: భారత్ సరిహద్దుల ద్వారా సంక్లిషమైన భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఈ సవాళ్లు భారత సమగ్రతకు, అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించాయన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన సందేశం ఇస్తూ పై విధంగా అన్నారు. ఉగ్రవాదం, సరిహద్దు వద్ద చొరబాట్లను మన సైనికులు త్యాగనిరతితో ఎదుర్కొంటున్నాయన్నారు. భారత్‌కు చైనాతో 4వేల కి.మీ సరిహద్దు ఉంది.

01/02/2019 - 02:25

తిరువనంతపురం, జనవరి 1: లింగ సమానత్వాన్ని పాటించాలని, వివక్షను వీడనాడాలన్న సందేశంతో కేరళ రాష్ట్రంలో 35 లక్షల మంది మహిళలతో 620 కిలోమీటర్ల పొడవున మానవహారం నిర్వహించారు. ఉత్తర ప్రాంతంలోని కాసర్‌గడ్ నుంచి దక్షిణ ప్రాంత సరిహద్దు వరకు మంగళవారం ఈ మానవహారాన్ని ఏర్పరిచారు.

Pages