S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/01/2019 - 05:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందాల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ గాని, రాహుల్‌గాంధీ గాని ఎన్నడూ జోక్యం చేసుకోలేదని కేంద్ర రక్షణశాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం అసత్యాలను పుట్టిస్తోందని విమర్శించారు.

01/01/2019 - 04:21

కొత్త ఆశలు, సరికొత్త తీర్మానాలు..ఎన్నో, ఎనె్నన్నో విజయాలను ప్రోది చేసుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త ఏదైనా ఆశల సమన్వితమే..గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని తప్పులకు తావులేకుండా ముందుకు సాగేందుకు దోహదం చేసేదే. అంతర్గతంగా, అంతర్జాతీయంగా భారత దేశం కొత్త పుంతలు తొక్కింది. రోదసీలో అబ్బురపడే అద్భుతాలను సాకారం చేసుకుంది.

12/31/2018 - 16:48

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ రెండవ తేదీకి వాయిదా పడింది. ముమ్మారు తలాక్ వ్యతిరేక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దాదాపు 10 ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి.

12/31/2018 - 16:46

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు అభినందనలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఘనవిజయం సాధించటం ఆయన అభినందిస్తూ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవ్వాలని ఆకాంక్షించారు. ఆమె పాలన విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

12/31/2018 - 16:43

న్యూఢిల్లీ: 1984 సిక్కు అల్లర్ల కేసులో శిక్షపడిన కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ నేడు ఢిల్లీ కోర్టు ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనను తూర్పు ఢిల్లీలోని మండోలి జైలుకు తరలించారు. తనకు పిల్లలు, మనమలు, మనుమరాండ్లు ఉన్నారని, వారికి సంబంధించిన ఆస్తి పంపకాలు, ఇతర విషయాలు చూసుకునేందుకు జనవరి 31వరకు గడువు ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించిన విషయం విదితమే.

12/31/2018 - 12:36

హైదరాబాద్:తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు మరింత ముందుకు వెళ్లాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

12/31/2018 - 12:32

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ సైనిక దుస్తులు ధరించిన కొందరు నాగౌమ్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వద్ద చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. రాత్రంతా ఈ కాల్పులు జరిగాయని, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కొందరు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సైనిక అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో చొరబాటుదారుల మృతదేహాలు పడివున్నాయి.

12/31/2018 - 12:30

థానె: మహారాష్టల్రోని భివండి దుస్తుల కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. మూడు అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోనికి తెచ్చాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

12/31/2018 - 12:28

న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొన్నది. ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా పోడియంను చుట్టుముట్టి తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభా కార్యక్రమాలు పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. మధ్యాహ్నాం రెండు గంటలకు త్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.

12/31/2018 - 12:27

న్యూఢిల్లీ:ముమ్మారు తలాక్‌ను చెబితే విడాకులు ఇవ్వటాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రవేశపెట్టే బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ కానివ్వకుండా అడ్డుకుంటామని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముమ్మారు తలాక్ చెప్పటాన్ని ఎలా నేరంగా పరిగణిస్తామో అలాగే ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్ర్తి, పురుషులకు సమాన న్యాయం ఉండాలని అన్నారు.

Pages