S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/31/2018 - 04:19

కోల్‌కతా: లెజెండరీ ఫిల్మ్‌మేకర్ మృణాల్ సేన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాజిక రుగ్మతలే కథా వస్తువులుగా ఆయన అందించిన సినిమాలు అజరామరణాలు.

12/31/2018 - 02:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రధానమంత్రిగా అద్భుతంగా పనిచేసే శక్తి సామర్థ్యాలు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సహా మిత్రపక్షాలు రాహుల్ గాంధీ నాయకత్వం కింద పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

12/31/2018 - 02:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశాలు కన్పించడం లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జనవరి ఎనిమిదితో ముగియనున్నాయి. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలలో ఉంటున్న హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్లు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు వాస్తవానికి బీజేపీ ఎన్నికల హామీగా పేర్కొనవచ్చు.

12/31/2018 - 02:22

థానే, డిసెంబర్ 30: సాధువుల కంటే సైన్స్‌ను నమ్ముకుని ఉంటే వ్యవసాయం బాగుండేదని, రైతుల పరిస్థితి ఆరోగ్యంగా ఉండేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. మన దేశంలో కాషాయ వస్త్రాలు వేసుకునే సాధువులంటే ప్రజలకు ఎక్కువగా గురి అన్నారు. కాని వ్యవసాయ రంగం రూపురేఖలను సైన్స్ మార్చిందన్నారు.

12/31/2018 - 02:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశంలో 1961 నుంచి జరిగిన 13 మతకల్లోలసంఘటనలపై విచారణ కమిటీ నివేదికలను కనుగొనేందుకు ఒక సీనియర్ అధికారిని నియమించాలని కేంద్ర సమాచార కమిషన్ కేంద్రహోంశాఖను కోరింది. ఈ నివేదికలు తమ వద్ద లేవని కేంద్రహోంశాఖ తెలిపిన నేపథ్యంలో కమిషన్ పై విధంగా స్పందించింది. సమాచార కమిషనర్ బిమాల్ జుల్కా ఈ ఆదేశాలు జారీ చేశారు.

12/31/2018 - 02:21

ఔరంగాబాద్ (బిహార్), డిసెంబర్ 30: బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. వారు పాల్పడ్డ హింసలో ఒకరు మృతి చెందగా, పది వాహనాలు దగ్ధమయ్యాయని ఎస్పీ సత్యప్రకాష్ ఆదివారం తెలిపారు. డియో పోలీస్‌స్టేషన్ పరిధిలో బిగహ గ్రామంలో శనివారం రాత్రి నరేంద్ర సింగ్ (55) అనే వ్యక్తిని మావోలు కాల్చి చంపారు. మృతుడు బిహార్ ఎంఎల్‌సి రాజన్‌కుమార్ ఇసంగ్‌కు అంకుల్ అవుతారు.

12/31/2018 - 02:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పేదరిక నిర్మూలన, రక్షణ, భద్రతా రంగంలో స్వయం సమృద్ధి, త్రివిధ దళాల అణ్వాయుధీకరణతోపాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మంచిపేరు తీసుకురావటంలో గణనీయమైన ఫలితాలను సాధించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఆకాశవాణిలో దేశ ప్రజలకు ‘మనసులోని మాట’ను వినిపిస్తూ 2018లో ఈ మూడు రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించామని తెలిపారు.

12/31/2018 - 02:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పాఠకులు పుస్తకాలు చదివితేనే రచయితలు రాస్తారు.. రచయితలు రాస్తేనే ప్రచురణకర్తలు వాటిని పబ్లిష్ చేస్తారు. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాల పరిశీలన వల్లే పుస్తకానికి ఆదరణ పెరుగుతుందో, తరుగుతుందో తెలుసుకోవచ్చు. అయితే పుస్తక ప్రియులకు, బుక్ పబ్లిషర్స్‌కు 2018 సంవత్సరం గొప్ప అనుభూతిని మిగిల్చిందని చెప్పవచ్చు.

12/31/2018 - 01:14

కోల్‌కతా, డిసెంబర్ 30: పల్లె జీవితాన్ని, కుటుంబ అనుబంధాలను, పీడితులు, శ్రామికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించి, ‘ఆర్ట్ ఫిల్మ్స్’కు కూడా ఓ గుర్తింపును తీసుకొచ్చి, సామాన్య ప్రజల చెంతకు తీసుకెళ్లిన దార్శనిక దర్శకుడు మృణాల్ సేన్ కన్నుమూశారు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్ ‘ భారత దర్శక రత్నాలు’గా పేర్కొంటారు.

12/30/2018 - 04:23

ఘాజీపూర్ (యూపీ): రైతుల రుణ మాఫీ అంశంపై ప్రజలను తప్పుదోవబట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. రుణమాఫీ అనేది లాలీపప్ లాంటి హామీ అని ఆయన అన్నారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన జేడీఎస్-కాంగ్రెస్ ప్రభు త్వం కేవలం 800 మంది రైతులరుణాలను మాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చే హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉడాలన్నారు.

Pages