S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/30/2018 - 03:21

అహ్మదాబాద్, డిసెంబర్ 29:్భరత దేశంలో లౌకికవాదానికి తిరుగు లేదని, ఇది భారతీయుల డిఎన్‌ఏలోనే ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతికూల వాదనలను గట్టిగా ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 64వ జాతీయ సభలో శనివారం మాట్లాడిన వెంకయ్య నాయుడు ‘భారత దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని విమర్శలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఏమీ లేదు.

12/30/2018 - 03:19

న్యూఢిల్లీ,డిసెంబర్ 29:్భరత్‌లో పర్యటిస్తున్న భూటాన్ లోటే షేరింగ్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం సమావేశమయ్యారు. స్ధానిక హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. భూటాన్ ప్రధానితో సుహృద్భావ రీతిలో చర్చలు జరిపానని, భావ సారూప్యం కలిగిన అంశాలపై తాము చర్చించుకున్నామని రాహుల్ ట్విటర్‌లో తెలిపారు.

12/30/2018 - 03:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీకి అనుకూలంగా ప్రభంజనం వీస్తుందని, ప్రజలు తమ పార్టీ పాలన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం ఎటువంటి సహకరం అందించలేదన్నారు.

12/30/2018 - 03:16

ముంబయి, డిసెంబర్ 29: దేశంలో బలహీనవర్గాలవారిని రాజకీయంగా దోపిడీకి ఉపయోగించుకోకుండా, ఈ వర్గాల ప్రజల్లో విద్య, సామాజిక సాధికారత సాధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

12/30/2018 - 03:15

చిత్రం..అస్సాంలోని చిరాగ్‌లో జరుగుతున్న డ్విజింగ్ ఉత్సవానికి వచ్చిన దిలీప్‌సింగ్ రానా అలియాస్ ది గ్రేట్ ఖలీతో కరచాలనం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సదానంద్ సోనేవాల్

12/30/2018 - 03:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన రిజర్వేషన్ల కోసం సు ప్రీం కోర్టును ఆశ్రయిస్తామాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

12/30/2018 - 03:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఢిల్లీలో వాయు కాలుష్య ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయి. వాతావరణ కాలుష్యం తీవ్రంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 389 నుంచి 269 మధ్య నమోదైందని, ఇది ప్రమాదకరమైన స్థాయి అని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం అతి ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరుకుందన్నారు.

12/30/2018 - 02:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అగస్టాల్యాండ్ హెలికాప్టర్ల కేసులో బీజేపీ నిందితుడు క్రిస్టియన్ మైఖేల్‌పై బీజేపీ ప్రభుత్వం వత్తిడి తెచ్చి కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లను చెప్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కేసులో క్రిస్టియన్ మైఖేల్ న్యాయవాదులను కలవడంపై ఢిల్లీ కోర్టు ఆంక్షలు విధించింది.

12/30/2018 - 02:57

బెంగళూరు, డిసెంబర్ 29: కర్నాటకలో రైతులు తీవ్ర దుర్భిక్షంతో బాధపడుతుంటే, ముఖ్యమంత్రి కుమారస్వామి సింగపూర్‌లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి వెళ్లడం దారుణమని బీజేపీ విమర్శించింది. జేడీస్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 156 తాలూకాల్లో 377 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ పార్టీ ట్వీట్ చేసింది. రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని, కర్నాటక అప్పుల్లోకి జారుకుంటోందన్నారు.

12/30/2018 - 04:20

హైదరాబాద్, డిసెంబర్ 29: ప్రయాగ్‌రాజ్ (పూర్వ నామం- అలహాబాద్)లో కుంభమేళ జనవరి 15 నుండి ప్రారంభం కానుందని ఉత్తర ప్రదేశ్ పరిశ్రమల మంత్రి సతీష్ మహానా తెలిపారు. శనివారం నాడు ఆయన ఫిక్కీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ సమర్ధవంతంగా కుంభమేళాను నిర్వహించేందుకు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Pages