S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/30/2018 - 02:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుపై రాజకీయ లబ్ధికోసం కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు కావాలని కొన్ని రోజులుగా న్యాయ శాఖ కార్యదర్శి చుట్టూ తిరిగిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం తగదన్నారు.

12/30/2018 - 02:25

అంతరిక్ష పరిశోధనలో అగ్ర దేశాలకు దీటుగా భారత్ తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటుంది. ఘచిన్నడుగులతో మొదలైన అంతరిక్ష ప్రయాణం అనన్య సామాన్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నో ఎనె్నన్నో రోదసీ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడమేకాకుండా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను సైతం అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన ఇస్రో తన ఘనతను విశ్వ విఖ్యాతం చేసుకుంది.

12/28/2018 - 23:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తెలుగుదేశం, అన్నా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులు చేసిన గొడవ కారణంగా శుక్రవారం కూడా లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగలేదు. మూడు పార్టీల సభ్యులు పోడియాన్ని చుట్టు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణ పూరిత వాతావరణంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొట్టుకుపోయింది.

12/28/2018 - 23:31

బెంగళూరు, డిసెంబర్ 25: దేశంలో యువత నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. విద్య, ఉద్యోగం, ఔత్సాహిక పారిశ్రామిక రంగం, ఎక్స్‌లెన్స్ రంగాల్లో యువత రాణించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందన్నారు. శుక్రవారం ఆయన కర్నాటకలో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు.

12/28/2018 - 23:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్ల కాలంలో 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి పురుసోత్తం రూపాల వెల్లడించారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో రెండు వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా?

12/28/2018 - 23:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగనయాన్ ప్రాజెక్టుకు 10 వేల కోట్ల రూపాయలను కేంద్ర కేబినెట్ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏడు రోజుల పాటు అంతరిక్షంలోకి పంపుతామని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ శుక్రవారం వెల్లడించారు.

12/28/2018 - 22:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: త్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభ ఆమోదించినందు వల్ల రాజ్యసభలో కూడా ఎటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కొనకుండా ఆమోదం పొందుతుందని కేంద్రం ఆశాభావంతో ఉంది. ముస్లిం మహిళలు త్రిపుల్ తలాక్ వల్ల అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యకు కొత్త చట్టంలో పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

12/28/2018 - 22:09

భోపాల్, డిసెంబర్ 28: మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమలనాథ్ మంత్రివర్గ సభ్యులుగా 28మంది ప్రమాణస్వీకారం చేసినా వారికి ఏయే శాఖలు కేటాయించాలో తెలియని అనిశ్చితి పరిస్థితి నెలకొంది.

12/28/2018 - 22:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ఇవ్వాలని భావిస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుణమాఫీ అంశం ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యం, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పడుతున్న ముద్రను చెరిపివేసుకునేందుకు వారికి ఏదో ఒక మేలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది.

12/28/2018 - 22:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థల ద్వారా ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చే ఉద్దేశంతో తీసుకువచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని దేశంలోని 11 రాష్ట్రాలు, ఢిల్లీ మినహాయించి అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే అమలు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.

Pages