S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/27/2018 - 03:48

న్యూఢిల్లీ: మేఘాలయలో గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు.

12/27/2018 - 03:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రధానితో సమావేశం అనంతరం ఆయన హోంశాఖమంత్రిని కూడ కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. కేసీఆర్ వెంట ఎంపీ వినోద్ కూడా ఉన్నారు.

12/27/2018 - 02:48

14 ఏళ్ల క్రితం చెన్నైని ముంచెత్తిన ఓ పెను సునామీ విషాదం ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు పీడకలగానే మిగిలిపోయింది. ఆప్తులను కోల్పోయి, ఆస్తులను నష్టపోయి కకావికలమైన కుటుంబాలు ఎన్నో నేటికీ ఆ పీడకలను గుర్తు చేసుకుంటూ విలపిస్తూనే వున్నాయి.
ఆ ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వారికి నివాళిగా పట్టిన పక్కం బీచ్‌లో శ్రద్ధాంజలి ఘటిస్తున్న మహిళలు

12/27/2018 - 02:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ‘రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలామ్ 2012లో రెండోసారి ఎన్నికయ్యేందుకు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చినా, దానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విముఖత చూపకపోవడంతో ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు.’ అని చరిత్రకారుడు రాజమోహన్ గాంధీ రాసిన కొత్తపుస్తకంలో వెల్లడించారు.

12/27/2018 - 02:24

భువనేశ్వర్, డిసెంబర్ 26: ఒడిశాకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఒడిశాకు అటానమీ ఇస్తే ప్రత్యేక హోదా లేదా కేంద్రం గ్రాంట్‌లు అక్కర్లేదన్నారు. అటానమీ వల్ల రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సొంతంగా నిధులు సేకరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. 90వ దశకంలోనే బీజూ పట్నాయక్ ఈ ప్రతిపాదన చేశారని నవీన్ పట్నాయక్ చెప్పారు.

12/27/2018 - 02:22

మందిర్‌బజార్ (పశ్చిమబెంగాల్), డిసెంబర్ 26: రైతులను ఆదుకుంటామని చెప్పి తప్పుడు హామీలను ఇస్తున్నారని కేంద్రంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. పంటల బీమా పథకం వల్ల ప్రయోజనం లేదన్నారు. 80 శాతం చెల్లింపులను రాష్ట్రప్రభుత్వమే భరించిందన్నారు. రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి చులకన అని ఆమె అన్నారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, పంటల బీమా పథకంలో కేంద్రం వాటా 20 శాతం ఉందన్నారు.

12/27/2018 - 02:21

బెంగళూరు, డిసెంబర్ 26: తన అనుచరుడిని చంపిన వారిని నిర్ధాక్షిణ్యంగా చంపాలని, ఏమి జరిగినా తాను చూసుకుంటానని చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నిరాకరించారు. భావోద్వేగంతో తాను ఆ మాటలన్నానని ఆయన చెప్పారు. కుమారస్వామి సొంత జిల్లా మాండ్యాలో ఒక జేడీఎస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. దీనిపై కుమారస్వామి దిగ్భ్రాంతికి లోనయ్యారు.

12/27/2018 - 02:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: విపత్తుల సంభవించినప్పుడు అద్భుతమైన పనితీరును ప్రదర్శించే వ్యక్తులు, సంస్థలకు వార్షిక అవార్డులు అందజేయాలని కేంద్రం నిర్ణయించింది.

12/27/2018 - 02:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో కలుసుకుంటానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ బుధవారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ ముందు నిర్ణయించిన ప్రకారం తాను 25 లేదా 26న ఢిల్లీకి వెళ్లి చంద్రశేఖరరావుతో సమావేశం కావలసి ఉండింది..

12/27/2018 - 02:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశంలో 17 రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ఇంచార్జీలను నియామించింది. తెలంగాణ ఇంచార్జీగా కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు అరవింద్ లింబవలను నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు మురళీధరన్, కో-ఇంచార్జిగా మహారాష్టక్రు చెందిన సునీల్ దియోధర్ ఇప్పటికే వ్యవహారిస్తున్నారు. మరోసారి వీరి నియామకాలపై పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.

Pages