S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/08/2018 - 02:38

ముంబయి, డిసెంబర్ 7: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సభలో స్పృహ కోల్పోయారు. మహారాష్టల్రోని అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాహురిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సభలో పాల్గొన్న గడ్కరీ జాతీయ గీతాలాపన జరుగుతున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు.

12/08/2018 - 02:35

జాల్వార్ (రాజస్థాన్), డిసెంబర్ 7: జేడీ నేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌యాదవ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచే విధంగా శరద్ యాదవ్ మాట్లాడారన్నారు. ఈ విషయమై కేంద్రెన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తన శరీరంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటువంటి తరహా భాష ఉపయోగించకుండా ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలన్నారు.

12/08/2018 - 02:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సామాజిక మాధ్యమాల ద్వారా వదంతలు, దూషించే సందేశాలను నిలుపుదల చేసేందుకు వీలుగా ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగించనున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న వదంతుల వల్ల హింస జరుగుతోంది. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్, ట్విట్టర్ ద్వారా వదంతులు ప్రసారమవుతున్నాయి. వీటికి చెక్ పట్టేందుకు ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

12/08/2018 - 02:32

డెహ్రాడూన్, డిసెంబర్ 7: తమ మనోభావాలను దెబ్బతీస్తోందని హిందూ సంఘాలు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ‘కేదారనాథ్’ చలనచిత్రాన్ని ఉత్తరాఖండ్‌లోని ఏడు జిల్లాల్లో ప్రదర్శించకుండా నిషేధం విధించినట్టు ఒక అధికారి శుక్రవారం వెల్లడించారు.

12/08/2018 - 02:28

గౌహతి, డిసెంబర్ 7: పౌరసత్వ సవరణ బిల్లు- 2016ను వ్యతిరేకిస్తున్న నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఈఎస్‌ఓ), క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్‌ఎస్) ఆ బిల్లును నిరసిస్తూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా, పార్లమెంటు ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి.

12/08/2018 - 02:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఉభయ సభలు సజావుగా సాగడానికి వీలుగా ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంఛనంగా నిర్వహించే ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి ప్రభుత్వ అజెండాను వివరించి, సభలు సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతుంటారు.

12/08/2018 - 02:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నెహ్రూ-గాంధీ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘకాలం అధికారంలో ఓ కుటుంబం పుణ్యమాని దేశంలో పని సంస్కృతి మంటగలిచిపోయిందని, తద్వారా అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు. దేశంలో పరిస్థితి పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉండేదని మోదీ నిప్పులు చెరిగారు.

12/08/2018 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా హైదరాబాద్ ఐఎస్‌బీకి చెందిన ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. అరవింద్ సుబ్రహ్మణియన్ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఆయన ఆ పదవిలో నాలుగేళ్లపాటు ఉన్నారు.

12/08/2018 - 00:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ రెండోసారి మంచి మెజారిటీతో అధికారం చేపట్టనుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి అవకాశాలున్నాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నాయ. అయితే మెజారిటీ తక్కువగా ఉండవచ్చునని చెబుతున్నారు.

12/07/2018 - 04:21

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నిర్వహించతలపెట్టిన రథయాత్ర వ్యవహారం గురువారం అనేక మలుపులు తిరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా ఈ యాత్రను అనుమతించలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపధ్యంలో గురువారం బీజేపీ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు దీన్ని శుక్రవారానికి వాయిదావేసింది.

Pages