S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/06/2018 - 13:06

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లీ జిల్లా మోరాబ్ గ్రామంలో 20 సంవత్సరాల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతికి హెచ్‌ఐవి వైరస్ సోకిందని, దీంతో ఆ నీటిలో వైరస్ ఉంటుందని తాము తాగలేమని, నీటిని తోడెయ్యాలని గ్రామస్తులు భీష్మించుకోవటంతో చేసేదిలేక అధికారులు ఆ నీటిని గత నాలుగు రోజుల నుంచి మోటార్లు ఏర్పాటుచేసి తోడేస్తున్నారు.

12/06/2018 - 03:34

న్యూఢిల్లీ: ప్రతిష్టాకరమైన ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అనే స్కీంను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ స్కీం కింద ప్రతి నియోజకవర్గం నుంచి 11 మంది వృద్ధులను ఎంపిక చేసి వారిని తీర్థయాత్రలకు పంపుతారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు నిండిన వారు ఈ యాత్రకు అర్హులు. భార్య, భర్తలను యాత్రకు ఎంపిక చేస్తారు.

12/06/2018 - 03:16

జైపూర్, డిసెంబర్ 5: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల స్కాంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్‌ను దుబాయ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిందని, ఈ స్కాంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. మైఖేల్‌ను సీబీఐ మన దేశానికి తెచ్చిందని, దీనిపై స్పందించాలని ఆయన కోరారు. మైఖేల్‌ను రక్షించాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు.

12/06/2018 - 03:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఆర్మీలో పనిచేసే సిపాయిలకు ఉన్నత మిలిటరీ సర్వీసు వేతనాన్ని ఇచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ నిరాకరించడం పట్ల ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీకి అనిల్ అంబానీ బాగోగులు, ప్రయోజనాలు తప్ప సైనికుల గురించి పట్టించుకోరని ఆయన అన్నారు. దేశాన్ని పరిరక్షించేందుకు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సైనికుల గురించి మీరు పట్టించుకోరా అని ఆయన నిలదీశారు.

12/06/2018 - 03:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: జీశాట్-11ను విజయవంతంగా అంతరిక్షంలో ప్రయోగించడంపై ఇస్రో శాస్తవ్రేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఇస్రో శాస్తవ్రేత్తలు చేస్తున్న కృషి ప్రతిభారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు. మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలకు కూడా సైన్స్, టెక్నాలజీ సేవలు అందించేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుందన్నారు. ఇది అత్యంత పొడువైన, బరువైన, అత్యంత ఆధునిక ఉపగ్రహమని ఆయన కొనియాడారు.

12/06/2018 - 02:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య తలెత్తిన విభేదాలపై సుప్రీం కోర్టులో కేంద్రం తన వాదనలు వినిపించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాల మధ్య గొడవను కేంద్రం ఓ పరిహాసంగా అభివర్ణించింది. అత్యున్నత సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు బహిరంగ విమర్శలకు దిగడం సీబీఐను అవహేళన చేసేదిగా ప్రభుత్వం తప్పుపట్టింది.

12/06/2018 - 02:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: యూపీలోని బులందర్‌షహర్‌లో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపడం దారుణమని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. మూక హింసకు పోలీసులు బలయ్యారన్నారు.

12/06/2018 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు తీసుకుంటున్నారు. సమావేశాల ప్రారంభం రోజు అంటే ఈనెల 11న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 11 నుంచి జనవరి 8 వరకూ జరుగుతాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పూర్తికాల సమావేశాలు ఇవేకానున్నాయి.

12/06/2018 - 02:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: అధికారంలో ఉన్న పార్టీని ఓడించే సంప్రదాయాన్ని పాటిస్తున్న రాజస్థాన్ ఓటర్లు శుక్రవారం జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా లేక బీజేపీకి మరోసారి ఓటు వేస్తారా? రాజస్థాన్ శాసనసభలో మొత్తం 200 సీట్లుంటే ఎన్నికలు మాత్రం 199 సీట్లకు జరుగుతున్నాయి. అల్వర్ జిల్లాలోని రాంగర్ నియోజకవర్గంలో బీఎస్‌పీ అభ్యర్థి మరణించటంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది.

12/06/2018 - 02:24

బులందర్‌షెహర్, డిసెంబర్ 5: యూపీలో మూక హింసకు బలైన పోలీసు అధికారి సుబోధ్ కుమార్ సింగ్ దూరం నుంచి కాల్చిన తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ వల్ల మరణించినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది. మూకహింసలో కాల్పులకు గురై మరణించిన ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెదడు, తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు నివేదికలో వైద్యులు తెలిపారు. బుల్లెట్ మెదడులో ఉండిపోయింది.

Pages