S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/26/2018 - 04:28

అళ్వార్: కాంగ్రెస్ పార్టీకి న్యాయవ్యవస్థ పట్ల ఎలాంటి విశ్వాసం లేదని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నాడిక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ధ్వజమెత్తారు. కులరాజకీయాలే పరమావధిగా ఆ పార్టీ పనిచేస్తోందని అన్నిరకాల మర్యాదలను విస్మరించి మరింతగా దిగజారిందని మోదీ అన్నారు.

11/26/2018 - 02:06

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో బీజేపీ భయోత్పాతం కలిగించే రీతిలో మత ప్రాతిపదికన ప్రజల విభజనకు పాల్పడుతోందని, దీనిని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాలు అని ఆ పార్టీ వ్యూహకర్త, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు.

11/26/2018 - 02:05

ముంబయి: కసబ్‌కు మరణ శిక్షను సుప్రీం కోర్టును ఖాయం చేసిన తర్వాత అతడిని ఉరి తీయడానికి పుణెలోని యరవాడ జైలుకు తరలించడంలో పెద్ద కసరత్తే జరిగింది. ఈ ఆపరేషన్ నిర్వహించడానికి కొంతమంది పోలీసులను ప్రత్యేకంగా ఎంపిక చేసి వారిని ఇందులో భాగస్వాములను చేశారు. అతడిని పుణె జైలుకు తరలించిన తర్వాత ఆ విషయం తెలియజేడానికి ఏడు పదాల రహస్య పదాలను వాడారు. అందులో చివరిగా వాడిన కోడ్ ‘పార్సిల్ రీచ్‌డ్ ఫాక్స్’.

11/26/2018 - 02:01

బెంగళూరు, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సీకే జాఫర్ షరీఫ్ ఇకలేరు. 85 ఏళ్ల షరీఫ్ ఆదివారం ఇక్కడ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. షరీఫ్ గుండెపోటు వల్ల మృతి చెందారని వైద్యులు తెలిపారు. శుక్రవారం నమాజు చేయడం కోసం మసీదుకు వెళ్లడానికి కారు ఎక్కుతుండగా షరీఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

11/26/2018 - 02:17

న్యూఢిల్లీ, నవంబర్ 25: రాజకీయమే సర్వస్వమైతే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆకాశవాణిలో యాభయ్యవ ‘మనసులోని మాట’ కార్యక్రమంలో మాట్లాడారు. రాజకీయాలను సర్వస్వం చేయటం లేదా రాజకీయాన్ని శక్తివంతమైన పనిముట్టుగా ఉపయోగించటం వలన ఆరోగ్యకరమైన సమాజం అభివృద్ధి కాలేదన్నారు. సమాజాభివృద్ధికి తోడ్పడే పలు అంశాల్లో రాజకీయం ఒక అంశం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

11/26/2018 - 02:16

న్యూఢిల్లీ, నవంబర్ 25: సముద్ర మార్గం ద్వారా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి భారత్ సిద్ధంగా ఉందని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా తెలిపారు. పదేళ్ల క్రితం సముద్ర మార్గం ద్వారా ముంబయిలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ సంఘటన తర్వాత భారత నావికాదళం పూర్తిగా అప్రమత్తమైందని, ఇప్పుడు తాము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

11/26/2018 - 00:43

నహన్ (హిమాచల్‌ప్రదేశ్), నవంబర్ 25: వేగంగా వెళ్తున్న ఒక బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి నదిలో పడటంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 51 మంది గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌వౌర్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రేనుక- దదహు- నహన్ రహదారిపై ఖద్రి గ్రామం సమీపంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

11/26/2018 - 00:59

అయోధ్య (ఉత్తరప్రదేశ్), నవంబర్ 25: ‘జైశ్రీరాం..’ అన్న నినాదాలతో అయోధ్య పట్టణం ఆదివారం హోరెత్తింది. రామాలయ నిర్మాణ అంశంపై చర్చించేందుకు విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ధర్మసభకు దేశం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ‘ఆలయ నిర్మాణం ఎంతో దూరంలో లేదు. వచ్చే ఏడాది ప్రయాగలో జరిగే కుంభ్‌లోనే తేదీని ప్రకటిస్తాం. అంత వరకూ ఓపిక పట్టండి’అని నిర్మోహి ఆకారాకు చెందిన రాజీదాస్ అన్నారు.

11/25/2018 - 04:27

భారత వాణిజ్య రాజధాని ముంబయిపై పాకిస్తాన్ ముష్కరులు దాడిచేసి పదేళ్లు అవుతోంది. 2008 నవంబర్ 26వ తేదీన ఈ దాడిలో ముంబయి మహానగరం తల్లడిల్లింది. అనేక మంది అమాయకులు మరణించారు.
హోటల్ తాజ్ అలాగే కొలాభాలోని చాబాద్ హౌస్‌లను లక్ష్యంగా చేసుకొని పాక్ ముష్కరులు రెచ్చిపోయారు. ఆనాటి దాడిని తట్టుకొని అనన్యంగా నిలబడి తమ సత్తాను చాటుకున్న ముంబై పౌరుల ధీరోదాత్తతకు

11/25/2018 - 03:47

హైదరాబాద్, నవంబర్ 24: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రైలు ప్రమాదాలను నియంత్రించడానికి చేపట్టాల్సిన విధానాలపై అన్ని కోణాల్లో అధ్యయనాలు పూర్తయినట్టు కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అశ్వినీ లోహనీ వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ రైలు మార్గాల్లో ట్రాక్ పనితీరుపై ఆయన శనివారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో రైల్వే ట్రాక్ పనితీరుపై తనిఖీలు చేపట్టారు.

Pages