S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/23/2018 - 23:41

జైపూర్, నవంబర్ 23: రాజస్థాన్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా కులం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అధికార బీజేపీ లేదా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సామాజిక సమీకరణలే కీలకం. ఓ కులం అభ్యర్థిని పార్టీ నిలబెడితే అదే సామాజిక వర్గం వ్యక్తిని పక్కపార్టీ బరిలో దించుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే 31 చోట్ల ఈ తరహా పోటీ నెలకొంది. ఒకే కులానికి చెందిన అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

11/23/2018 - 23:39

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో పరిపాలన వ్యవస్థలు, పరిపాలన తీరు పట్ల ప్రజల్లో నిరాశ అలుముకుందని మాజీ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఈ వ్యవస్థలు జాతి గర్వించదగిన విధంగా ఉండాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. శుక్రవారం ఇక్కడ శాంతి, సామరస్యత, సంతోషం , మార్పు అంశాలపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

11/23/2018 - 23:38

పనాజీ, నవంబర్ 23: అనారోగ్యం బారిన పడిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఇక్కడి ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ప్రత్యేకించి రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21న వందలాదిగా ఆందోళనకారులు సీఎం పారికర్ ని వాసగృహం వద్దకు తరలివచ్చి నిరసన తెలిపిన సం గతి తెలిసిందే.

11/23/2018 - 23:36

* హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

11/23/2018 - 04:31

జమ్ము, నవంబర్ 22: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా జోరుగా ఎమ్మెల్యేల బేరసారాలు జరుగుతున్నాయని, పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఉన్న పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని జమ్ముకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. అందుకే తాను అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. విరుద్ధ భావజాలంతో ఉన్న పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాని పని అన్నారు.

11/23/2018 - 04:19

న్యూఢిల్లీ, నవంబర్ 22: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గులాబీ (పింక్) రంగు బ్యాలెట్ పత్రాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ ఝా, మహమ్మద్ ఖాన్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

11/23/2018 - 03:57

న్యూఢిల్లీ, నవంబర్ 22: పాకిస్తాన్ ఆదేశం మేరకే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి మద్దతు ఇచ్చిందని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ గురువారం ఉపసంహరించుకున్నారు.

11/23/2018 - 03:55

న్యూఢిల్లీ, నవంబర్ 22: కేంద్ర బీసీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు ఏర్పాటుచేసిన బీసీ కమిషన్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కల్పించే వెనుకబడిన కులాల రిజర్వేషన్లను వర్గీకరించేందుకు కమిషన్‌కు ఇచ్చిన సమయాన్ని ఇప్పుడు 2019 మే 31 తేదీ వరకు పొడిగించారు.

11/23/2018 - 03:43

న్యూఢిల్లీ, నవంబర్ 22: గవర్నర్ అసెంబ్లీని రద్దుచేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర కేబినెట్ మంత్రివర్గం గురువారం సమీక్షించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అసలు కేబినెట్ సమావేశంలోని అజెండాలో జమ్మూ కాశ్మీర్ అంశం లేనప్పటికీ కేబినెట్ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించి సమీక్ష జరిగేలా చేశారని కేబినెట్ సమావేశానంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరించారు.

11/23/2018 - 03:41

లక్నో, నవంబర్ 22: అయోధ్యలో ఈ నెల 25వ తేదీన విశ్వహిందూ పరిషత్ నిర్వహించనున్న రామ భక్త సభ వల్ల ముస్లింలలో అభద్రత భావం పెరుగుతోందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు జఫర్‌యాబ్ జిలానీ, ఖలీద్ రషీద్ ఫరంగిమహీలి చెప్పారు. వివిధ రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీహెచ్‌పీ తాజాగా అయోధ్య అంశాన్ని తెరపైకి తెస్తోందన్నారు.

Pages