S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/23/2018 - 03:39

తిరువనంతపురం, నవంబర్ 22: స్వామి అయ్యప్ప ఆలయ సందర్శనపై పది నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలికలు, మహిళలపై నిషేధానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన ఆధారం వెలుగు చూసింది. రుతుస్రావ వయస్సు కలిగిన స్ర్తిలు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించకూడదన్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసినప్పటి నుంచీ ఈ విషయపై తీవ్రస్థాయిలో రాద్దాంతం జరుగుతున్న విషయం తెలిసిందే.

11/23/2018 - 03:37

న్యూఢిల్లీ, నవంబర్ 22: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని గవర్నర్ సత్యపాల్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం, అనైతికం, నీతిబాహ్యం అని కాంగ్రెస్ నేత మనీష్ తివారి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. అలాగే గవర్నర్ చర్యను కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం తీవ్రంగా ఖండించారు.

11/23/2018 - 03:37

న్యూఢిల్లీ, నవంబర్ 22: ‘్భరతీయ పిల్లలు చదువుల్లో దిట్టలు..’ అని మనం చెప్పుకోవడం కాదు.. ప్రపంచంలోనే పేరెన్నికగన్న కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడిస్తోంది. భారత్‌లో విద్య నభ్యసించినవారిలో చాలామంది ప్రపంచ దేశాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందుకు ఉదాహరణగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లను చెప్పుకోవచ్చు.

11/23/2018 - 03:24

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు. జూదరులకు, పందెం కాసే వాళ్లలో జోష్ కనపడుతుంది. దేశ వ్యాప్తంగా బుకీల కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. లక్షలు, కోట్లల్లో బెట్టింగ్ వ్యాపారం సాగుతోంది.

11/23/2018 - 03:22

ఐజ్వాల్, నవంబర్ 22: మిజోరంలో ఐజ్వాల్ ఈస్ట్-2 నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుడైన రాబర్ట్ రొమావియా రొటే పోటీలో ఉండడమే కారణమైతే ఆయన ప్రచార తీరు వినూత్నంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరిలోకి ఆయనే ధనికుడు. ఎన్నికల అఫిడవిట్‌లో 55 కోట్ల రూపాయలు ప్రకటించిన రాబర్ట్ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) తరఫున బరిలో ఉన్నారు.

11/23/2018 - 03:17

భోపాల్, నవంబర్ 22: వచ్చేవారం జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 11,000 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టే ఈసీ ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోపక్క ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

11/23/2018 - 00:40

న్యూఢిల్లీ, నవంబర్ 22: భారత్‌లోని నాలుగోవంతు ప్రజలకు ఇంటికే గ్యాస్ సరఫరా చేసే బృహత్ పథకానికి ప్రధాని నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. వాహనాలకు సీఎన్‌జి, ప్రజలకు ఇంటికే వంటగ్యాస్‌ను పైపుల ద్వారా సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాలకు అనగా ఇంచుమించు దేశంలోని నాలుగోవంతు ప్రజలకు వంటగదికే నేరుగా గ్యాస్ సరఫరా అవుతుంది.

11/22/2018 - 16:55

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు గురువారంనాడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని ఉదయ సింహ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మత్తయ్య తరపున వాదనలు వినిపించారు. అలాగే మత్తయ్యకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వాలని కోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 29న చేపడతామని ధర్మాసనం తెలిపింది.

11/22/2018 - 12:35

సత్నా: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా బిర్సింగ్‌పూర్ ప్రాంతంలో పాఠశాల వ్యాన్, బస్సు ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌తో సహా ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

11/22/2018 - 12:28

ముంబయి: పంట రుణాలు రద్దు చేయాలని, కరవు సాయం చేయాలని కోరుతూ మహారాష్ట్ర రైతులు దాదర్ చేరుకున్నారు. వేలాది మంది రైతులు ముంబయిలోని అజాద్ మైదాన్ దిశగా కదిలారు. రెండు రోజులు పాటు సాగే ఈ నిరసన ప్రదర్శన పూణె నుంచి బయలుదేరింది. ఈ ఆందోళనలో మెగాసేసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ కూడా పాల్గొంటున్నారు.

Pages