S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2018 - 12:27

చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాయలసీమ, దక్షిణకోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడులో వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

11/22/2018 - 16:59

జమ్మూకాశ్మీర్: అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైందేనని గవర్నర్ సత్యపాల మాలిక్ తన చర్యను సమర్థించుకున్నారు.

11/22/2018 - 04:44

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసుకు సంబంధించి వెలువడిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తూ, అల్లర్ల బాధితులకు దశాబ్దాల పాటు న్యాయం జరగకపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించింది.

11/22/2018 - 03:30

ఇండోర్, నవంబర్ 21: దేశంలోని పార్లమెంట్, సీబీఐ లాంటి వ్యవస్థలు ప్రధాని మోదీ పాలనలో క్రమంగా అప్రతిష్టపాలు అవుతున్నాయని, దీనిపై అప్రమత్తమై సరైన ఆలోచనలతో సరిచేయడానికి ప్రయత్నించకపోతే మన ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో అవినీతి తారస్థాయికి చేరుకుందని అన్నారు.

11/22/2018 - 03:24

పనాజీ, నవంబర్ 21: దేశంలో ప్రతి ఒక్కరి జీవితమూ ఓ అద్భుత కథేనని, అయితే దానిని సరైన రీతిలో చెప్పగలగాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ అన్నారు. బుధవారం పనాజీలో ఆయన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫిల్మ్ ఫెస్టివల్ 49వ దని, ఈ ఫెస్టివల్ ద్వారా అంతర్జాతీయంగా ఉన్న సినీ మేధావులు, టెక్నాలజీతో మనకు పరిచయం ఏర్పడుతుందని వెల్లడించారు.

11/22/2018 - 03:21

లక్నో, నవంబర్ 21: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో తమ విధానం స్పష్టంగా ఉందని పార్టీ ప్రకటించింది. అయోధ్య అంశంపై ఓ రాజకీయ తీర్మానం చేసిన పార్టీ దేశంలో బీజేపీ ఒక్కటేనని యూపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు రామమందిరం నిర్మాణానికి సంబంధం లేదని బుధవారం ఆయన వివరించారు.

11/22/2018 - 01:52

పనాజీ, నవంబర్ 21: అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్) జ్యూరీలో వివాదం రాజుకుంటోంది. చిత్రాల ఎంపికలో ‘జాతి వ్యతిరేకత’ వ్యక్తమైనట్టు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐఎఫ్‌ఎఎఫ్‌ఐ ఇండియన్ పనోరమ సభ్యుడైన డైరెక్టర్ ఉజ్వల్ చటర్జీ చేసిన ఆరోపణలను ఫీచర్ జ్యూరీ చీఫ్ రాహుల్ రవయిల్ తోసిపుచ్చారు.

11/22/2018 - 01:49

గురునానక్ దేవ్‌జీ 550వ జయంతిని పురస్కరించుకుని నాంకానా సాహిబ్ గురుద్వారాను
దర్శించడానికి అట్టారీ నుంచి పాకిస్తాన్‌కు ప్రత్యేక రైలులో బయలుదేరిన సిక్కులు.

11/22/2018 - 01:47

పనాజీ, నవంబర్ 21: గోవాలో గనుల తవ్వకాలను పూర్తిగా నిలిపివేయడంతో ఆ రంగంపై ఆధారపడ్డవారు లబోదిబోమంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన మైనింగ్ చట్టాన్ని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. దీంతో 88 గనుల లీజింగ్ రెన్యువల్ చేయకుండా స్థానిక కోర్టు పెండింగులో ఉంచడంతో ఈ ఏడాది మార్చి నుంచి ఈ రంగంపై ఆధారపడ్డవారు పూర్తిగా ఉపాధిని కోల్పోయారు.

11/22/2018 - 01:45

భోపాల్, నవంబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే బీజేపీ ఎంతో మెరుగ్గా పాలన సాగిస్తోందని, స్వాతంత్య్రం తర్వాత ఆ పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోతూ వస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశ ప్రజలు మంచిరోజుల (అచ్చేదిన్)ను ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నా రు.

Pages