S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/29/2016 - 17:34

చండీగఢ్: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశానికి లూధియానా రాగా, ఆయన కారుపై కొందరు సిక్కు యువకులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇటీవల లూధియానా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో మరణించగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితత కేజ్రీవాల్ అక్కడికి వెళ్లారు.

02/29/2016 - 13:27

దిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలను వివరిస్తూ తన ప్రసంగం ముగించిన వెంటనే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

02/29/2016 - 13:26

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభకు సమర్పించారు. జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్‌లో విశేషాలు...
* మొత్తం బడ్జెట్‌ రూ.19.78లక్షల కోట్లు
* ప్రణాళికా వ్యయం రూ.5.5లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షలకోట్లు
* బ్యాంకుల మూలధన సమీకరణకు రూ.25వేల కోట్లు

02/29/2016 - 13:17

దిల్లీ: వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభకు సమర్పించారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

02/29/2016 - 12:12

దిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ద్రవ్యోల్బణం 9.6 నుంచి 5.4 శాతానికి తగ్గిందని, వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తోందని వివరించారు.

02/29/2016 - 12:02

దిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆయన బడ్జెట్ ప్రతిపాదనను సభలో చదివి వినిపిస్తున్నారు.

02/29/2016 - 08:04

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత నాలుగేళ్లలో దాదాపు 60వేల మంది పిల్లల ఆచూకీ లభించడం లేదు. తప్పిపోతున్న పిల్లల్ని పసిగట్టి వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 2.5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధ్యం కావడం లేదు.

02/29/2016 - 08:01

న్యూఢిల్లీ: ఇంటర్‌వ్యూ కాల్‌లెటర్స్ ఇక స్వస్తిచెబుతున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) తెలిపింది. వాటికి బదులుగా ఇ-సమ్మన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ప్రతి ఏడాది ఐఏఎస్, ఐపిఎస్ ఉద్యోగాలకోసం యుపిఎస్‌సి పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. వాటిలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షతోపాటు ఇంటర్‌వ్యూలు ఉంటాయి.

02/29/2016 - 08:00

న్యూఢిల్లీ: జెఎన్‌యులో చోటుచేసుకున్న పరిణామాలపై పార్లమెంటులో తన వాగ్ధాటితో అధికారపక్ష సభ్యుల్ని మెప్పించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పార్టీలో మాత్రం పరిస్థితి అంత అనుకూలంగా లేనట్టు తెలుస్తోంది. పైపెచ్చు.. చర్చ జరిగిన తొలిరోజు లోక్‌సభలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల అధిష్ఠానం గుర్రుగా ఉందట.

02/29/2016 - 07:58

న్యూఢిల్లీ: ‘మీకే కాదు..నాకూ పరీక్ష ఉంది. అది సాధారణ బడ్జెట్ పరీక్ష.నేనూ దాన్ని ఎదుర్కోవాలి’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల నుద్దేశించి అన్నారు. మొత్తం 125 కోట్ల మంది పెట్టే ఈ పరీక్షను ఎదుర్కోగలనన్న ధీమా తనకు ఉందని తెలిపారు. మంగళవారం టెన్త్, ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి వత్తిళ్లకు లోనుకాకుండా వాటిని ఎదుర్కోవాలని స్ఫూర్తిదాయక రీతిలో స్పష్టం చేశారు.

Pages