S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/22/2019 - 07:39

న్యూఢిల్లీ, ఆగస్టు 21: పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పునఃసమీక్షలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించారు. సుజనా చౌదరి ఢిల్లీలో ఆయన నివాసంలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని మార్చాలని చూస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అభిప్రాయపడ్డారు.

08/22/2019 - 07:34

చిత్రం... అఖిల భారత మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులతో బుధవారం ఢిల్లీలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ

08/22/2019 - 07:30

న్యూఢిల్లీ, ఆగస్టు 21: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ఔచిత్యంపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని బీజేపీ సంకల్పిస్తోంది. 370 రాజ్యాంగ అధికరణను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించేందుకు సినిమా, క్రీడలు, విద్యా రంగం సహా వివిధ రంగాలకు చెందిన 2,000 మంది ప్రముఖులను రంగంలోకి దింపబోతోంది.

08/22/2019 - 07:26

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రక్షణ, ఖనిజ వనరుల వంటి ఆరు కీలక అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని భారత్-జాంబియా దేశాలు నిర్ణయించుకున్నాయి.

08/22/2019 - 07:14

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఉన్న ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఓబీసీల హక్కులపై వెనకబడిన వర్గాలు సాధికారిత సంఘం, అఖిల భారత వెనకబడిన వర్గాల అభ్యున్నతిపై ఢిల్లీలో సామాజిక న్యాయం-సమానత్వం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

08/22/2019 - 07:13

న్యూఢిల్లీ, ఆగస్టు 21: జగిత్యాల జిల్లా కలెక్టర్ డా. ఏ శరత్ ఉత్తమ్ కలెక్టర్‌గా అవార్డును అందుకున్నారు. అంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో శరత్ ఉత్తమ కలెక్టర్‌గా నిలిచారు. ప్రభుత్వ పథకాల అమలు, ఉత్తమ పాలన, వినూత్న ఆలోచనల అంశంపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలెక్టర్ల పనితీరును పరిశీలించిన సంస్థ అవార్డుకు ఎంపిక చేసింది.

08/22/2019 - 07:11

న్యూఢిల్లీ, ఆగస్టు 21: సెంట్రల్ ఢిల్లీలోని ఝన్‌దేవాలన్, రామ్‌లీలా మైదాన్ మధ్య గల ప్రాంతమంతా బుధవారం నీలి సముద్రాన్ని తలపించింది. దేశ రాజధానిలోని రవిదాస్ మందిర్ కూల్చివేతను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది దళితులు తరలిరావడంతో ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోయాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటి (డీడీఏ) ఈ నెల పదో తేదీన రవిదాస్ మందిర్‌ను కూల్చివేసింది.

08/22/2019 - 07:09

డెహ్రడూన్, ఆగస్టు 21: వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించి ఆదుకునేందుకు వెళ్ళిన హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ మృత్యు ఒడిలోకి వెళ్ళారు. ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి చెందారు. మరణించిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ జలమయమై, జనజీవనం అస్తవ్యస్థమైంది.

08/22/2019 - 07:06

లక్నో, ఆగస్టు 21: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 18 మంది కొత్త మంత్రులకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయిన తరవాత మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే మొదటి సారి. 23 మంది మంత్రుల్లో 18 కొత్తముఖాలే. పాత వారికి ఐదుగురికి పదోన్నతి లభించింది.

08/22/2019 - 07:04

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఆర్మీలో సంస్కరణలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఆమోదం తెలిపారు. సైన్యంలో ప్రత్యేకంగా ఓ విజిలెన్స్ సెల్ ఏర్పాటవుతోంది. ప్రధాన కేంద్రంతో సహా పలు విభాగాల్లో తీసుకురావల్సిన మార్పులు చేర్పులపై గత ఏడాది సమగ్రంగా అధ్యయనం చేశారు. చివరికి ఓ రోడ్ మ్యాప్‌ను తయారు చేశారు. 1.3 మిలియన్ల మంది ఉన్న సైన్యంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

Pages