S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/10/2018 - 16:21

చత్తీస్‌గఢ్: రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ జాతీయ భద్రతను ఉపయోగించుకుంటే బీజేపీ మాత్రం ఈ అంశానికే అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అన్నారు. ఆయన లోర్మి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పేదలందరికీ గృహాలు నిర్మించాలనే సంకల్పంతో ప్రధాని ఉన్నారని అన్నారు. చత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

11/10/2018 - 16:21

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న వేళ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేసింది. రాయపూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణసింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ రైతులు, గిరిజనుల కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని అన్నారు.

11/10/2018 - 16:17

చత్తీస్‌గఢ్: వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలుగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను రానున్న ఐదేళ్లలో తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన చత్తీస్‌గఢ్‌లోని చరమ ఎన్నికల సభలో మాట్లాడుతూ దేశానికి ఆహారం, పండ్లు, కూరగాయాలు సరఫరా చేసే స్థాయికి తీసుకువెళతామని, ప్రధాని మోదీ దేశంలో 15 మంది వ్యక్తుల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.

11/10/2018 - 12:28

పాట్నా: తనకు విడాకులు ఇస్తేనే ఇంటికి తిరిగి వస్తానని ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ వెల్లడించారు. ఆయన ఓ న్యూస్ ఛానల్‌వారితో ఫోన్‌లో మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు తనకు మద్దతు ఇవ్వాలని అన్నారు. తనకు, తన భార్య ఐశ్వర్యారాయ్‌కు మధ్య విభేదాలు తొలగిపోయే ఆస్కారం లేదని అన్నారు. కాగా తేజ్ ప్రతాప్ హరిద్వార్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.

11/10/2018 - 12:25

కేరళ: శబరిమల యాత్రకు ఆన్‌లైన్‌లో దాదాపు 550 మంది అమ్మాయిలు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. అలాగే శుక్రవారంనాటికి దాదాపు 3.50 లక్షల మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు హాజరుకావచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో గత రెండు నెలల నుంచి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం విదితమే.

11/10/2018 - 12:23

పూల్వామా: శనివారం ఉదయం పూల్వామా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని తికెన్ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందటంతో భద్రతాదళాలు చుట్టుముట్టి వారిని మట్టుబెట్టి ఆపరేషన్‌ను పూర్తిచేశారు.

11/10/2018 - 12:23

అసోం: రాష్ట్రంలోని జోర్హత్ వైద్య కళాశాల ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది రోజుల్లో 19మంది నవజాత శిశువులు చనిపోయారు. యునిసెఫ్ ప్రతినిధులు ఆసుపత్రిని సందర్శించారు. పదిమంది శిశువులు తక్కువ బరువుతో పుట్టడం వల్ల మృతిచెందారని, ముగ్గురు శిశువులు హృద్రోగాలతోనూ, ఆరుగురు ప్రసవ సమయంలో తలెత్తిన ఇబ్బందులు వల్ల చనిపోయారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

11/10/2018 - 12:22

కర్ణాటక: కర్ణాటకలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఏటా నిర్వహించే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను ఈ ఏడాది కూడా కుమారస్వామి ప్రభుత్వం నిర్వహించేందుకు సన్నహాలు చేస్తుండటంతో బీజేపీ ఈ ఉత్సవాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో హుబ్లీ, ధార్వాడ, శివమొగ్గ తదితర ప్రాంతాలతో సహా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

11/10/2018 - 05:59

జగదల్‌పూర్: అర్బన్ మావోయిస్టులను కాంగ్రెస్ వెనుక ఉండి ప్రోత్సహిస్తూ ఆదివాసీల జీవితాలను నాశనం చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. చత్తీస్‌గఢ్‌లో జరిగే ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం ఆయన రాష్ట్రంలో మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీలను కాంగ్రెస్ ఎందుకు ఎగతాళి చేస్తోందో అర్థం కావడం లేదని అన్నారు.

11/10/2018 - 01:50

జైపూర్, నవంబర్ 9: కాంగ్రెస్‌లో అవినీతిలో కొట్టుమిట్టాడుతోందని, టిక్కెట్లను కాంగ్రెస్ నేతలు అమ్ముకుంటున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. ఇటీవల సోషల్ మీడియాలో రాజస్తాన్‌లోని ఫలోడీ అసెంబ్లీ సీటును రూ.3.5 కోట్లకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు, కాంగ్రెస్‌పార్టీ ఈ సీటు టిక్కెట్‌ను అమ్ముకుంటోందని సామాజిక మాద్యమంలో కథనం ప్రసారమైంది.

Pages