S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/20/2016 - 12:33

లాతూర్: మహారాష్టల్రో తీవ్ర అనావృష్టి కారణంగా తాగునీటికి కటకటలాడుతున్న లాతూర్ పట్టణానికి బుధవారం ఉదయం నీళ్ల వ్యాగన్లతో మరో రైలు చేరుకుంది. 55 వ్యాగన్లతో 25 లక్షల లీటర్ల నీటిని ఇక్కడికి తీసుకురావడంతో ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం కలిగింది. కొద్దిరోజుల క్రితం 5 లక్షల లీటర్లతో తొలి నీటి రైలు లాతూర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

04/20/2016 - 06:45

కత్రా, ఏప్రిల్ 19: తెలివితేటల యుగం అయిన 21వ శతాబ్దం భారత దేశందేనని, దేశ జనాభాలో 80 కోట్ల మంది యువకులు 35 ఏళ్లకన్నా తక్కువ వయసు వారయినందున ప్రతి యువకుడి కల ఈ దేశ ప్రగతి గాథ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

04/20/2016 - 06:56

నైనితాల్, ఏప్రిల్ 19: ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును రాష్ట్ర హైకోర్టు తీవ్ర పదజాలంతో తప్పుబట్టింది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కుల్ని కేంద్రం కాలరాసిందని, ఆ విధంగా కల్లోలాన్ని సృష్టించిందని వ్యాఖ్యానించింది.

04/20/2016 - 06:41

జగత్‌బల్లవ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 19: ప్రతిపక్షాలు తన గురించి, తన పార్టీ గురించి ఎంతగా దుష్ప్రచారం సాగిస్తే , రాబోయే అసెంబ్లీ ఎన్నిల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించడం అంతగా సులభమవుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

04/20/2016 - 06:41

న్యూఢిల్లీ ఏప్రిల్ 19: భార్య ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారానికి ఒడిగట్టడం(వైవాహిక అత్యాచారం) నేరంగా పరిగణించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ మంగళవారం తెలిపారు. వైవాహిక అత్యాచారం భారతీయ సామాజిక కోణంలో నేరంగా పరిగణించటం కుదరదంటూ నెల రోజుల క్రితం పార్లమెంట్‌లో మేనక చేసిన ప్రకటనపై దేశమంతటా దుమారం రేగిన సంగతి తెలిసిందే.

04/20/2016 - 06:40

న్యూఢిల్లీ ఏప్రిల్ 19: బేటీ బచావో, బేటీ పడావో(కూతుర్ని రక్షించు, చదివించు) ప్రచార కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించిన తరువాత దేశంలోని 49 జిల్లాల్లో బాలికల నిష్పత్తి పెరిగిందని కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటి వరకు దేశంలోని 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని.. అందులో 49జిల్లాల్లో సత్ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.

04/20/2016 - 06:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాబోయే రెండు నెలలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఏ)కింద జలసంరక్షణ, నీటి నిల్వ కోసం భారీ ఎత్తున కృషి చేయడం జరుగుతుందని ప్రదాని నరేంద్ర మోదీ అంటూ, ఈ కృషిలో తమ వంతు తోడ్పాటునందించాలని ఎన్‌సిసి లాంటి అధికార యువజన సంస్థలను కోరారు.

04/20/2016 - 06:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: చిన్నారిపెళ్లికూతురు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపుతిరుగుతోంది. ఆత్మహత్య కేసుకునే నాటికే ప్రత్యూష గర్భవతి అని, ఆత్మహత్యకు ముందు ఆమె అబార్షన్ చేయించుందని రిపోర్టుల్లో వెల్లడైంది. ముంబయిలోని జెజె ఆసుపత్రి వైద్యుల కథనాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ విషయాలు తెలిపింది.

04/20/2016 - 06:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఇషత్ జహాన్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బిజెపి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం ఉగ్రవాదులను ఉపేక్షించిందని, అందుకే ఈ కేసులో రెండవ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సోనియా గాంధీ అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరంను కోరారని బిజెపి అధికార ప్రతినిధి సాంబిత్ పట్రా నిప్పులు చెరిగారు.

Pages