S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/08/2018 - 16:57

కేరళ: కేరళ ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యతామిషన్ కార్యక్రమంలో భాగంగా అక్షర లక్ష్యంలో చేరిన కార్తియాయని అనే 96 సంవత్సరాల బామ్మకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ల్యాప్‌టాప్‌ను బహుకరించారు. ఎలాంటి కాపీ కొట్టకుండా పాసైన ఈ వృద్ధురాలిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సత్కరించిన విషయం విదితమే.

11/08/2018 - 16:56

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలోని థౌజండ్స్ ఓక్ ప్రాంతంలో బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్‌లో ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. విద్యార్థులు పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 11మంది వరకు గాయపడినట్లు సమాచారం. అగంతకుడు చనిపోయినట్లు గుర్తించారు. అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

11/08/2018 - 16:55

న్యూఢిల్లీ:ఆర్థిక వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం నడిపించేందుకే రెండేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దుచేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఆయన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. విదేశాల్లో భారతీయులకు ఉన్న బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి వచ్చాయి. చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవు అని అన్నారు.

11/08/2018 - 16:54

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్ళు అయిన సందర్భంగా మాజీ ప్రధాని మన్నోహాన్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. ప్రతి వ్యక్తిపై దీని ప్రభావం ఉందని, యువతకు ఉద్యోగావకాశాలు లేవని, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, ఉద్యోగులు కూడా దీనివల్ల ఇబ్బందులు పడ్డారని అన్నారు.

11/08/2018 - 16:53

కోల్‌కతా: పెద్ద నోట్లను రద్దు చేసి నేటికీ రెండేళ్లు అయింది ఈ సందర్భంగా పలువురు స్పందించారు. ఈ నోట్ల రద్దును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘‘ఇది ఓ భారీ కుంభకోణం. దీన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ దేశాన్ని మోసం చేసింది. ప్రజలు ఇపుడు అనుభవిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు. ఇది ఒక కర్కశమైన నిర్ణయం అని కాంగ్రెస్ నేత ఆనందశర్మ అన్నారు.

11/08/2018 - 16:52

చత్తీస్‌గఢ్: మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. దంతెవాడ జిల్లాలోని బచేలిలో ఓ బస్సుపై మావోయిస్టులు బాంబు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోయారు. వీరిలో సీఐఎస్‌ఎఫ్ జవాను కూడా ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించారు. చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది.

11/08/2018 - 12:34

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో విమానయాన సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో విమానాల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసుల్లోని సిబ్బంది సమ్మె దిగటంతో ఈ పరిస్థితి నెలకొన్నది. కాగా సిబ్బందితో చర్చలు జరిపేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

11/08/2018 - 12:31

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ప్రమాదకర స్థాయిలో వాతావరణ కాలుష్యం కమ్మేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీపావళి సందర్భంగా రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని, అదీ గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా ఢిల్లీవాసులు రాత్రంతా కాల్చారు. దీంతో ఢిల్లీని టపాసుల పొగ కమ్మేసింది. దీంతో గాలి నాణ్యత సూచీ 999కి పడిపోయింది.

11/07/2018 - 03:16

కోపపు తాపపు శాపపు
పాపపు చీకట్లు తొలగి పండుగవోలెన్
దీపావళి అరుదెంచెను
మీ పిల్లాపాపలకిక మేలే జరుగున్
*
శుభాకాంక్షలు

పాఠకులు, చందాదారులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలు,
శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు.
- చీఫ్ ఎడిటర్
*

గమనిక
దీపావళి పర్వదినం సందర్భంగా

11/07/2018 - 02:23

న్యూఢిల్లీ, నవంబర్ 6: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండగ రోజు పవిత్ర పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగం కేదార్ నాథ్‌ను సందర్శించనున్నారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలసీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటారు.

Pages