S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/06/2018 - 01:52

కోల్‌కతా, నవంబర్ 5: ‘ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించరాదు’ అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలోని కొన్ని ఆలయాల్లోకి మహిళల ప్రవేశం నిషిద్ధం. దీనిపై మహిళా సంఘాలు కోర్టులకెక్కడం వారికి అనుకూలంగా తీర్పులివ్వడం జరిగిపోయాయి. అయినప్పటికీ ప్రస్తుతం శబరిమల అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

11/06/2018 - 01:39

న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం భయపెడుతోంది. సోమవారం నగరాన్ని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. ఇలాంటి పరిస్థితి రావడం వారం రోజుల్లోనే ఇది రెండోసారి. దీపావళిని ఊహించుకుని నగర పౌరుల భయాందోళనకు గురవుతున్నారు. పండగ రెండ్రోజుల ముందే వాతావరణ ఇలా ఉంటే ఏడో తేదీన తరువాత పరిస్థితి ఏమిటన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

11/06/2018 - 01:37

లక్నో, నవంబర్ 5: అయోధ్యలో అద్భుతమైన రామమందిరం నిర్మించనున్నట్టు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య స్పష్టం చేశారు. రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు సానుకూల తీర్పు వస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

11/06/2018 - 01:29

రాయ్‌పూర్, నవంబర్ 5: ఇప్పటి వరకూ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీగా సాగిన చత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు త్రిముఖ పోటీ అనివార్యమైంది. పదిహేనేళ్లుగా రాష్ట్రంలో అప్రతిహత రీతిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రమణ్ సింగ్ నాలుగోసారి బరిలోకి దిగారు. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్న అజిత్ జోగి ఇప్పుడు జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ పేరుతో కొత్త పార్టీ పెట్టడం వల్ల త్రిముఖ పోటీ అనివార్యమైందన్నారు.

11/06/2018 - 01:16

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్

11/06/2018 - 01:14

న్యూఢిల్లీ, నవంబర్ 5: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌కు బలంగా ఉన్న స్థానాల్లో పట్టుసాధించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. సీనియర్ నేత కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాకు బలమైన నియోజకవర్గాలైన ఛింద్వారా, గుణ, శివ్‌పురి, గ్వాలియర్‌లను కొల్లగొట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

11/06/2018 - 01:11

ఐజ్వాల్, నవంబర్ 5: మిజోరం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. అసెంబ్లీ స్పీకర్ హైఫీ సోమవారం పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తితో కూడిన జిల్లాల ఏర్పాటుకు బీజేపీ అధినాయకత్వం హామీ ఇవ్వడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.

11/06/2018 - 01:04

భువనేశ్వర్, నవంబర్ 5: రైతుల ఆందోళనతో ఒడిశాప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతులు చేపట్టిన పాదయాత్ర సోమవారం రాష్ట్ర రాజధానిని సమీస్తున్న క్రమంలో ప్రభుత్వం స్పందించడం గమనార్హం.

11/06/2018 - 01:02

ఐజ్వాల్, నవంబర్ 5: ఎన్నికలు జరుగుతున్న మిజోరంలో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఏకంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపైనే వేటుపడింది. తమ మనోభావాలను దెబ్బతీసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ఎస్‌బీ శశాంక్‌ను తొలంగించాలని అఖిలభారత సర్వీసు అధికారులు, పౌర, విద్యార్థి సంఘాలు డిమాండ్ చినికిచినికి గాలివానగా మారింది.

11/06/2018 - 00:20

న్యూఢిల్లీ, నవంబర్ 5: భారత దేశం ఇతర దేశాలపై దాడి చేయదు.. అయితే ఇతరులెవ్వరైనా దాడిచేస్తే వారిని వదిలిపట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ అణు జరాంతర్గామి నావికాదళంలో చేరటంతో ‘శక్తిమాన్ భారత్’ రూపొందటం ప్రారంభమైందని నరేంద్ర మోదీ చెప్పారు.

Pages