S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/02/2018 - 02:01

న్యూఢిల్లీ, నవంబర్ 1: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 95 సీట్లలో పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి 14, తెలంగాణ జన సమితి, వామపక్షాలకు పది సీట్లు ఇస్తున్నాం.. ఈ మేరకు మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా ప్రకటించారు.

11/02/2018 - 01:00

తిరువనంతపురం, నవంబర్ 1: చదువుకోవడానికి వయసు అడ్డురాదని, నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉండాలే కాని ఎప్పుడైనా చదువుకోవచ్చునని నిరూపించింది కేరళలోని ఒక బామ్మగారు. 96 వయసులో 98 మార్కులు తెచ్చుకుని ఔరా అని అందరూ ముక్కుమీద వేలువేసుకునేలా చేసింది ఈ అవ్వ.

11/01/2018 - 22:33

గబోరోనే (బోత్స్వానా), నవంబర్ 1: భారతదేశంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

11/01/2018 - 22:25

న్యూఢిల్లీ, నవంబర్ 1: వచ్చే లోక్‌సభకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో అవసరమైన పరిజ్ఞానంతో రూపొందించిన ఎం 3 టైప్ ఈవీఎంల తయారీ బాధ్యతను కేంద్రం రెండు పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు అప్పగించింది. ఆ రెండు సంస్థలు 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు ఎన్నికల కమిషన్‌కు పంపినట్టు అధికారులు వెల్లడించారు.

11/01/2018 - 22:24

శ్రీనగర్, నవంబర్ 1: జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాదులు మృతి చెందగా, ఒక జవాన్ గాయపడ్డాడు. గురువారం జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు ఖాన్‌సాహిబ్‌లోని జాగూ ప్రాంతంలో వెతుకుతున్నారు. హఠాత్తుగా వారిపైకి ఉగ్రవాద మూకలు కాల్పులకు తెగబడ్డాయి.

11/01/2018 - 22:23

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీల్యాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీల నుంచి నేరారోపణలను ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలను ఈనెల 26వ తేదీ వరకు అరెస్టు చేయకుండా ఢిల్లీ న్యాయస్థానం గురువారం రక్షణను పొడిగించింది.

11/01/2018 - 22:22

బెంగళూరు, నవంబర్ 1: కర్నాటక రాష్ట్రాన్ని విడగొట్టాలని కొందరు చేస్తున్న డిమాండ్‌ను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నాటక అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 63వ ‘కర్నాటక రాజ్యోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ కర్నాటక ప్రజలు అంతా ఐకమత్యంగా ఉంటారని, వేర్పాటు వాదుల ఆటలు చెల్లవని అన్నారు.

11/01/2018 - 17:25

న్యూఢిల్లీ:దేశంలో జీఎస్‌టీ వసూళ్లు భారీగా పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆయన గురువారంనాడు విలేకరులతో మాట్లాడుతూ దాదాపు లక్ష కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. సెప్టెంబర్‌లో 94,442 కోట్ల రూపాయలు ఉండగా అది లక్ష కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. తక్కువ వడ్డీ రేట్లు, పన్ను ఎగవేతలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ తరువాత లక్ష కోట్లకు చేరుకోవటం ఇదే.

11/01/2018 - 17:24

న్యూఢిల్లీ: బీజేపీయేతర పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. ఆయన నివాసానికి చేరుకున్న చంద్రబాబుకు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్వాగతం పలికారు.

11/01/2018 - 17:24

బెంగళూరు: కర్ణాటకలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేసిన రామనగర స్థానంలో నవంబరు 3వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎల్. చంద్రశేఖర్ ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో ఐకమత్యం లేదని, తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Pages