S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/22/2018 - 12:06

కోల్‌కతా : నిర్భయ తరహా ఘటన పశ్బిమ బెంగాల్లో జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. మహిళ కుటుంబ సభ్యులతో వచ్చిన భూ వివాదం కారణంగా సమీప బంధువే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అంతరంగిక భాగాల్లో రాడ్‌తో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

10/22/2018 - 12:04

న్యూఢిల్లీ : పెట్రో, డీజిల్‌పై వ్యాట్‌ టాక్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీలోని 400 పెట్రో బంకులను 23 గంటల పాటు సోమవారం మూతపడ్డాయి. అయితే ఈ సమ్మె రాజకీయంగా ప్రేరేపితమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

10/22/2018 - 02:51

న్యూఢిల్లీ: విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసుల గౌరవార్థం ఓ జాతీయ స్మారక చిహ్నాన్ని నిర్మించాలన్న విషయాన్ని గత ప్రభుత్వాలు ఎందుకు విస్మరించాయో చెప్పాలని ప్రధాన మంత్రి మోదీ ప్రశ్నించారు. ఈ అమరవీరుల పట్ల స్వాతంత్య్ర వచ్చిన నాటినుంచి ప్రభుత్వాలు విభిన్న వైఖరితో వ్యవహరించడం శోచనీయమన్నారు.

10/22/2018 - 02:01

అమృత్‌సర్, అక్టోబర్ 21: దసరా వేడుకల్లో పాల్గొన్నవారిని రైలు ఢీకొని 59 మందిని పొట్టన పెట్టుకున్న విషాద ఘటనపై ప్రజల ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదు. ఈ విషాద ఘటన జరిగిన చోటనే రైల్వే ట్రాక్‌లపై స్థానిక ప్రజలు ఆదివారం బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమను అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలతో తగాదా పడ్డారు. వారిపైకి రాళ్లు రువ్వారు.

10/22/2018 - 01:59

చిత్రం..కుటుంబ సమేతంగా ఆదివారం శ్రీ షిర్డీ సాయనాథుడిని దర్శించుకున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే

10/22/2018 - 01:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రతిఏటా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఒక జాతీయ అవార్డును ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వైపరీత్యాలలో చేపట్టే రక్షణ చర్యలలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసిన పోలీసులకు ఈ అవార్డును ఇస్తామని ఆజాద్ హింద్ గవర్నమెంట్ 75వ వార్షిక కార్యక్రమంలో ఆయన జాతీయ పోలీస్ స్మారక మ్యూజియంను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రకటించారు.

10/22/2018 - 01:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలకాంశాలపై ఈ నెల 25నుంచి 27 వరకు జరుగనున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో చర్చించనున్నారు.

10/22/2018 - 05:00

కోల్‌కతా, అక్టోబర్ 21: ప్రస్తుత పరిస్థితుల్లో తనంతట తానుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నిరోధించాలన్న లక్ష్యంతోనే ప్రతిపక్షాలు జతకట్టకూడదని ఆయన తెలిపారు.

10/22/2018 - 01:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై కాంగ్రెస్ వైఖరి గురించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థంలేని ఆరోపణలు చేస్తోందని, ఈ విషయంలో వారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిది అభిషేక్ మను సింఘ్వీ ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ‘నెహ్రూ- గాంధీ వంశీయులపై బీజేపీ కొత్త చరిత్రను లిఖించాలని చూస్తోంది’ అని ఆరోపించారు.

10/22/2018 - 02:57

అసెంబ్లీ ఎన్నికల్లో హైటెక్ ప్రచారానికి మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం శ్రీకారం చుట్టారు.
ఈ హైటెక్ ప్రచారం కోసం సిద్ధం చేసిన ఎన్నికల రథాన్ని కేంద్రమంత్రి తోమర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు

Pages