S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/18/2016 - 15:48

దిల్లీ: జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్యకుమార్‌పై దేశద్రోహం కేసును ఎత్తివేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే తమ పార్టీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి విజ్ఞప్తి చేసినట్లు ఆయన గురువారం విలేఖరులకు తెలిపారు.

02/18/2016 - 15:47

దిల్లీ: నగరంలోని పాటియాలా హౌస్ కోర్టు వద్ద కొందరిపై దాడులు జరగడం దురదృష్టకరమని, ఈ ఘటనలో దాడి చేసినట్లు సాక్ష్యాలుంటే సంబంధిత లాయర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. కోర్టు వద్ద జర్నలిస్టులు, విద్యార్థులపై దాడులకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఓ అధ్యయన బృందాన్ని నియమించినట్లు కౌన్సిల్ చైర్మన్ మీడియాకు తెలిపారు.

02/18/2016 - 15:47

చెన్నై: ఇక్కడ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్. హరీష్ అనే 32 ఏళ్ల ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం ఉదయం కార్యాలయ సిబ్బంది కనుగొన్నారు. స్ట్ఫా క్వార్టర్స్‌లో ఉంటున్న ఆయన ఉదయం పదిన్నర గంటలైనా బయటకు రాకపోవడంతో సిబ్బంది గది తలుపులు బలవంతంగా తెరిచి చూడగా ఆయన మృతదేహం కనిపించింది.

02/18/2016 - 15:46

దిల్లీ: నగరంలోని పాటియాలా హౌస్ కోర్టు వద్ద ఇటీవల జర్నలిస్టులపై కొందరు లాయర్లు జరిపిన దాడికి సంబంధించి నమోదైన కేసుపై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. దాడి ఘటనపై సుప్రీం నియమించిన న్యాయవాదుల బృందం, కోర్టు రిజిస్ట్రార్ ఇప్పటికే సమాచారం సేకరించి ఉన్నత న్యాయస్థానానికి నివేదికలు సమర్పించారు. ఇదే విషయమై దిల్లీ పోలీసు కమిషనర్ కూడా కోర్టుకు ఓ నివేదిను అందజేస్తారు.

02/18/2016 - 13:06

దిల్లీ: దిల్లీకి చెందిన బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మకు స్థానిక పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. ఇక్కడి పటియాలా హౌస్ కోర్టు వద్ద ఇటీవల విద్యార్థులకు, లాయర్లకు మధ్య ఘర్షణ జరిగినపుడు ఓ సిపిఐ కార్యకర్తను కొట్టినట్లు శర్మపై కేసు దాఖలైంది. సమన్లు తీసుకున్న తర్వాత శర్మ మీడియాతో మాట్లాడుతూ, తాను కోర్టుకు సహకరిస్తానని చెప్పారు.

02/18/2016 - 13:04

దిల్లీ: దక్షిణ దిల్లీలోని డిఫెన్స్ కాలనీ సమీపంలోని మురికివాడల్లో గురువారం ఉదయం భారీగా మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు.

02/18/2016 - 07:42

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యు వర్శిటీ గొడవలపై చర్చ జరగాలన్న కాంగ్రెస్ సూచనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. పార్లమెంటులో చర్చలు వాడిగా వేడిగా జరిగినా ఫరవాలేదుకానీ, స్థాయికి తగ్గిన విమర్శలు చేయకూడదని సూచించారు.

02/18/2016 - 07:38

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ గురుత్వాకర్షక సిద్ధాంతం రుజువైన నేపథ్యంలో ఆ దిశగా భారత్ కూడా మరో అడుగు ముందుకు వేసింది. అమెరికాలోని లీగో లేబొరేటరీతో కలిసి అత్యాధునిక రీతిలో గురుత్వాకర్షక తరంగాల అబ్జర్వేటరీని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.

02/18/2016 - 07:04

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే ఇందుకు సంబంధించిన సవరణ బిల్లు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాకపోచ్చునని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం 2019 వరకు ఉన్నందున అప్పటిలోగా సీట్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చునని ఎన్‌డిఏ ప్రభుత్వం భావిస్తోంది.

02/18/2016 - 05:50

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌ను బుధవారం పాటియాలా కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు కన్హయను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు.

Pages