S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/15/2018 - 06:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) విముఖత చూపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చలించిపోలేదు.

10/15/2018 - 06:42

గుర్గావ్, అక్టోబర్ 14: జడ్జి భార్యపై కాల్పులు జరిపి, ఆమె మృతికి కారకుడైన అంగరక్షకుడు మహిపాల్‌కు కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అడిషనల్ సెషన్స్ జడ్టి కృష్ణకాంత్ సతీమణి రీతూ(45), కుమారుడు ధృవ్(18)పై వారి అంగరక్షకుడే కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ రీతూ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారని గుర్గావ్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎం పవన్ చౌదరి ఆదివారం వెల్లడించారు.

10/15/2018 - 06:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత్‌లో విజయవంతమైన ‘ఆధార్’పై మలేసియా ఆసక్తిచూపుతోంది. మలేసియాలో సంక్షేమ పథకాల అమలులో దీన్ని ఆధారం చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జాతీయ గుర్తింపు కార్డు విధానంలో మార్పులు చేయాలని మలేసియా భావిస్తోంది. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకే అందేలా, సబ్సిడీల్లో అవకతవకలు అరికట్టడానికి భారత్‌లో అమలు చేస్తున్న యూనిక్‌ఐడీ విధానానే్న మలేసియా అనుసరించనుంది.

10/15/2018 - 06:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత్-అమెరికా రక్షణ బంధం మరింత దృఢతరం అవుతోంది. ఇందులో భాగంగా ఇరు దేశాల త్రివిధ దళాలు కలిసి విన్యాసాలు చేయడానికి రంగం సిద్ధమయింది. చరిత్రలో తొలిసారి ఈ రెండు దేశాల త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు వచ్చే సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంయుక్త విన్యాసాలలో ఇరు దేశాల ప్రత్యేక బలగాలను చేర్చడానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.

10/15/2018 - 05:54

జైపూర్, అక్టోబర్ 14: రాజస్థాన్‌లో అధికార బీజేపీలా శుష్కవాగ్ధానాలు ఇవ్వబోమని పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమలుకాని హామీలు ఉండవని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఆదివారం ఇక్కడ సమావేశమైంది.

10/15/2018 - 02:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయటం ఒక అలవాటుగా మారింది.. తనపై సెక్స్‌పరమైన ఆరోపణలు చేసిన వారందరికీ లీగల్ నోటీసులు ఇస్తానని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ చెప్పారు. ఆదివారం నైజీరియా నుండి తిరిగి వచ్చిన అనంతరం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తనపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలకు సాక్ష్యాలు చూపించగలరా? అని ప్రశ్నించారు.

10/14/2018 - 07:18

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పన్ను శాఖ తనిఖీల నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడి నివాసంలో ఐటీ సోదాలపై ఆ పార్టీ నాయకులు కేంద్రంపైనా, బీజేపీపైనా దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి బీజేపీ నాయకులు కూడా టీడీపీ నాయకులపై ప్రతి విమర్శలకు దిగారు.

10/14/2018 - 02:35

ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత విభాగం మానవ హక్కుల మండలి సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత్ ఎన్నికైంది. ఈ పదవీ కాలం మూడేళ్ల పాటుంటుంది. 2019 జనవరి 1వ తేదీ నుంచి 2021 వరకు భారత్‌కు మానవ హక్కుల సంస్థలో సభ్యత్వం ఉంటుంది. భారత్‌కు 188 ఓట్లు పోలయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం కావాలంటే కనీసం 97 దేశాల మద్దతు ఉండాలి.

10/14/2018 - 05:12

* వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం * బెంగళూరు సదస్సులో రాహుల్ ధ్వజం

10/13/2018 - 23:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: గోవాలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమై సంఖ్యాబలం తమకు ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి పారికర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని , ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

Pages