S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/10/2018 - 05:35

న్యూఢిల్లీ: ప్రమాదకర వాతావరణ మార్పులపై అప్రమత్తం అయ్యేందుకు ఏ రకమైన నివేదికలపైనా ఆధారాపడాల్సిన అవసరం లేకుండా మనదేశం పర్యావరణ పరిరక్షణకు వినూత్న పద్ధతులను అనుసరింస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ మంగళవారం నాడిక్కడ తెలిపారు.

10/09/2018 - 17:07

లక్నో: బీఎస్‌పీకి గౌరవప్రదమైన రీతీలో సీట్లు కేటాయించనంత వరకూ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిపోరే చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. పొత్తు కుదుర్చుకోవడం కోసం సీట్లు అడుక్కునేది లేదని ఆమె ఆమె తేల్చిచెప్పారు.

10/09/2018 - 16:49

చత్తీస్‌గఢ్: భిలాయ్ ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్లాంట్‌లోని గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోవటంతో ఈ ప్రమాదం సంభవించింది. రాయపూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు యత్నిస్తున్నాయి. ప్రమాదం జరిగే సమయంలో 24 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

10/09/2018 - 12:55

న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని కల్పిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు పూర్తిగా అహేతుకమైనదని పేర్కొంటూ జాతీయ అయ్యప్ప భక్తుల అధ్యక్షుడు శైలజా విజయన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోరు, జస్టిస్‌ ఎస్‌.కె.

10/09/2018 - 12:11

న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ నవంబర్‌లో ఇరాన్‌ నుండి భారత్‌ చమురు దిగుమతిని కొనసాగిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడుతూ 'ప్రపంచ నేతలు మా అవసరాలను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం' అని అన్నారు.

10/09/2018 - 12:07

జైపూర్‌: రాజస్థాన్‌ జైపూర్‌లో జికా వైరస్‌ లక్షణాలు ఏడుగురికి ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అవ్వడంతో కేంద్ర ఆరోగ్య శాఖ వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) కోరింది. ఏడుగురికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా, వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచామని రాజస్తాన్‌ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మొట్టమొదటి కేసు నమోదైన శాస్త్రినగర్‌ ప్రాంతంలో వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.

10/09/2018 - 12:04

చెన్నై : తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌పై అపఖ్యాతికరమైన వార్తను ప్రచురించారన్న ఆరోపణలపై వీక్లీ పత్రిక నక్కీరన్‌ ఎడిటర్‌, ప్రచురణ కర్త ఆర్‌ఆర్‌ గోపాల్‌ను చెన్నై విమానాశ్రయంలో మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పుణె వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లిన ఆయనను ఇద్దరు డిప్యూటీ కమిషనర్లతో పాటు ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లు కలిసి వాహనంలో బలవంతంగా ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

10/09/2018 - 02:37

భారత వైమానిక సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఘజియాబాద్‌లో సోమవారం అద్భుతరీతిలో విన్యాసాలు జరిగాయ. ఇటు గగనతల పటిమను చాటుకున్న వైమానిక దళాలు తమ విన్యాసాల ద్వారా వాయుసేన శక్తిని జగతికి చాటారు. సారంగ్ హెలికాప్టర్‌ల విన్యాసాలు అబ్బురపరిస్తే.. వాయుసేన కవాతు ఈ దళంలో క్రమశిక్షణకు అద్ధం పట్టింది

10/09/2018 - 02:35

హిందోన్ (యూపీ), అక్టోబర్ 8: ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత వాయుసేన సిద్ధంగా ఉందని, త్వరలో 36 రాఫెల్ జెట్లు, ఎస్-400 మిస్సయిల్స్ తమదళంలో చేరుతుండటంతో తమ సేన మరింత బలపడుతుందని ఐఏఎఫ్ చీఫ్ బిఎస్ ధనోవా తెలిపారు. ఇక్కడ జరిగిన ఎయిర్‌ఫోర్స్ డేలో ఆయన మాట్లాడారు.

10/09/2018 - 01:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: తెలంగాణలో బతుకమ్మ పండగ చేయడం లేదని చెప్పాడానికి నిజామాబాద్ ఎంపీ కవిత ఏమైనా సాంస్కృతిక శాఖ మంత్రా? అని బీజేపీ నాయకుడు ధర్మాపురి అరవింద్ మండిపడ్డారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడాతూ కేవలం ఎంపీ కవిత చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంచాలనే అహంకారం ధోరణిని టీఆర్‌ఎస్ నాయకులు విడనడాలన్నారు.

Pages