బిజినెస్

24/05/2013

కాకినాడ, మే 23: తూర్పు గోదావరి జిల్లాలో త్వరలో కాల్‌సెంటర్‌తో కూడిన ఆన్‌లైన్ పరిష్కారం (్ఫర్యాదుల నిర్వహణ వ్యవస్థ) సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది.

24/05/2013

న్యూఢిల్లీ, మే 23: మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 4.2 శాతం తగ్గి 3,327.54 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్‌ఇఎల్ గురువారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-ఏప్రిల్ నెలల్లో సంస్థ 3,379.81 కోట్ల రూపాయల నికర లాభాన్ని గడించింది.

24/05/2013

ముంబయి, మే 23: టాటా స్టీల్ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 6,528.51 కోట్ల రూపాయల నికర నష్టాన్ని పొందింది. ఐరోపాలో కంపెనీ కార్యకలాపాలకు, స్థిరాస్తుల వల్ల సుమారు 8,355.91 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లడంతో ఈ త్రైమాసికంలో సంఘటిత నష్టం పెరిగింది.

24/05/2013

న్యూఢిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సౌకర్యంపై చర్చల ప్రక్రియ పూర్తయింది. దీనిపై వచ్చే 10-15 రోజులలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సులను, తుది నిర్ణయాన్ని విడుదల చేస్తుంది. ‘ఉచిత రోమింగ్‌పై చర్చలు పూర్తయ్యాయి. తుది నియమ, నిబంధనలు సిద్ధమవుతున్నాయి.

24/05/2013

ముంబయి, మే 23: అమ్మకాలు తగ్గడం, తరుగుదల, వడ్డీల భారం తదితర కారణాల వల్ల మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 61.56 శాతం క్షీణించిందని జెఎస్‌డబ్ల్యు స్టీల్ గురువారం ప్రకటించింది.

24/05/2013

న్యూఢిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభం 18.54 శాతం తగ్గింది. ఈ ఫలితాలను ప్రకటించిన వెంటనే షేర్ మార్కెట్‌లో బ్యాంక్ షేరు ధర 7 శాతం తగ్గింది.

24/05/2013

న్యూఢిల్లీ, మే 23: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంపై ప్రభుత్వం వివరణలు జారీ చేస్తుందని వాణిజ్యం, పరిశ్రమల కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ గురువారం ఆర్థిక మంత్రి చిదంబరంతో జరిపిన సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో అన్నారు.

23/05/2013

ముంబయి, మే 22: సెర్చింజన్ సంస్థ ‘జస్ట్ డయల్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపివో) ముగింపు రోజైన బుధవారం 11.63 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఐపివో ద్వారా కంపెనీకి సుమారు 950 కోట్ల రూపాయలు లభించాయి. కంపెనీ 1.35 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా 15.76 కోట్ల షేర్లకు బిడ్డింగ్ లభించింది.

23/05/2013

ముంబయి, మే 22: ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టి)కు మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం 6.9 శాతం క్షీణించి 1788 కోట్ల రూపాయలు ఆర్జించింది. వడ్డీ భారం 132 శాతం పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది.

23/05/2013

న్యూఢిల్లీ, మే 22: చమురు,సహజవాయువు సంస్థ (ఒఎన్‌జిసి)కి చెందిన అంతర్జాతీయ విభాగం ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్(ఒవిఎల్) 2012-13 ఆర్థిక సంవత్సరం నికర లాభం 44 శాతం పెరిగి 3,929 కోట్ల రూపాయలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ సంస్థ 2,721 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading