చిత్ర

18/06/2013

ప్రస్తుతం తెలుగులో సమంత అగ్ర కథానాయికగా తాంబూలం అందుకుంటోంది. ఆమెకు పోటీగా అమలాపాల్ ఎదుగుతోందని ఆమధ్య అనేక వ్యాఖ్యలు వినిపించినా, ఆ తరువాత విషయం చప్పబడిపోయింది. ఇటవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో కూడా అమలాపాల్ నటించింది.

18/06/2013

బాలకృష్ణ హీరోగా నటించిన ‘అల్లరి పిడుగు’లో ఆయనకు జోడీగా నటించిన ఛార్మి మళ్లీ చాలాకాలం తరువాత ఆయనతో మరోసారి నటించబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సింహా’ తరువాత బాలయ్య నటిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే.

18/06/2013

ఇప్పటివరకూ తాము నిర్మించిన అనేక ఇంగ్లీష్ డబ్బింగ్ చిత్రాలకు ఎంత ప్రేక్షకాదరణ లభించిందో, అంతకన్నా ఎక్కువగా ప్రేక్షకులు ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ చిత్రాన్ని ఆదరిస్తున్నారని, ముఖ్యంగా లక్ష్మీగణపతి సంస్థకు స్రెయిట్ హిట్‌గా తొలి చిత్రమే లభించడం ఆనందంగా ఉందని నిర్మాత బి.సుబ్రహ్మణ్యం తెలిపారు.

18/06/2013

కొన్ని సినిమాలు హిట్టో, లేదా ఫ్లాపో అవుతాయి. కానీ వాటిలో నటించిన కొద్దిమంది నటీనటులకు మంచి పేరు వస్తుంది. గుర్తింపు తెస్తుంది. కారణం వారి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే. దాంతో వారి పేరుకి ముందు సినిమా పేరు గుర్తుకు వస్తుంది. అంటే ఆ సినిమానే ఇంటి పేరవుతుంది.

18/06/2013

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ తరువాత తెరకెక్కుతున్న చిత్రం ‘అత్తారింటికి దారేది’. ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకూ ఫస్ట్‌లుక్ కూడా రాలేదు. అప్పుడే ఈ మూవీపై ఉన్న క్రేజ్ 55 కోట్ల రూపాయల బిజినెస్ చేసి తెలుగు సినిమా పరిశ్రమలోనే ఆల్‌టైం రికార్డుగా నిలుస్తోంది.

18/06/2013

రమ్యశ్రీ ప్రధాన పాత్రలో ఆర్.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ‘ఓ మల్లి’ చిత్రానికి సంబంధించిన పాటలు త్వరలో విడుదల కానున్నాయి. బి.ఎస్.ప్రశాంత్‌కుమార్ నేతృత్వంలో బి.రమ్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

18/06/2013

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో సాగర్ (మొగలిరేకులు ఫేం), మృదుల జంటగా అభీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

18/06/2013

కృష్ణచంద్ర, సాయికుమార్, షమాసింగ్, పావని, రూపిక ప్రధాన పాత్రధారులుగా సువన్‌రాయ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘జన్మస్థానం’. ఓం సాయిప్రకాష్ దర్శకత్వంలో కె.రాయన్న రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశాలు హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లో చిత్రీకరించారు.

18/06/2013

వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా మరో చిత్రం సెట్స్‌పైకెక్కనుంది. శ్రీ సెవెన్ మూవీ మే కర్ పతాకంపై కట్టా మల్లి సమర్పణలో విజయ శ్రీనివాస్ గుండపనేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా కాశీబత్తుల దర్శకుడిగా పరిచయం కానున్నారు.

17/06/2013

రాజ్‌కుమార్ కథానాయకుడిగా నృత్య దర్శకురాలు తార దర్శకత్వంలో నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి పిక్చర్స్ పతాకంపై శ్రీమతి రమా రాజ్‌కుమార్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర పనులు ముగింపుదశకు వచ్చాయి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading